Devatha Serial: దేవుడమ్మ దేవిని రాధ ను పిలుచుకు రమ్మంటుంది.కానీ రాధ రాదు. అంతలో మాధవ్ అక్కడికి వస్తాడు.. దేవిని లోపలికి పంపించి మాధవ్ ను చెడామడా వాయిస్తుంది దేవుడమ్మ.. పిల్లల ముందు ఏ విషయాలు మాట్లాడకూడదో మీకు తెలీదా.. ఆ పసిమనసు తల్లి లేదన్న నిజం తెలుసుకుని ఎంత బాధ పడుతుందో చూడండి అని దేవుడమ్మ అంటే.. మాధవ్ ఇదంతా రాధ కావాలని చేస్తుంది. ఏమైనా అందాం అంటే ఊరిలో మా పరువు తీస్తుందని భయంగా ఉంది అని అంటాడు మాధవ్.. రాధ మీద ఉన్నవి లేనివి చెబుతాడు మాధవ్.. దేవుడమ్మ వెళ్లిపోయిన తర్వాత రాధ కు అన్ని దారులు మూసేస్తే నా దారిలోకే వస్తుంది అని మాధవ్ అనుకుంటాడు..
దేవమ్మా నేను ఒకటి అడుగుతా చేస్తావా.. ఇంకోసారి మా అమ్మ ఎవరు అని అడగనని నాకు మాట ఇవ్వు అని అంటుంది.. నువ్వే మా అమ్మావు అయితే నాకు మళ్ళీ అబద్దం చెప్పానని ఒట్టేయమని అంటుంది దేవి.. దాంతో రాధ వెనక్కు తీసుకుంటుంది తన చేతిని.. దేవి నువ్వు ఇంతే అని లేచి వెళ్ళిపోతుంది. రాధ వెక్కి వెక్కి ఏడుస్తుంది.
అమ్మ దేవిని వదిలిపెట్టి వచ్చావా అని అడుగుతాడు ఆదిత్య.. అలాగే మాట్లాడిన వాళ్లతో మాట్లాడి వచ్చాను. రాధా ఎప్పటిలాగే బయటికి రాలేదు. మాధవ తో మాట్లాడాను. దేవి మనసులో ఏదో బాధ పడుతుంది. నీకు అర్థమైందా అని అదిత్యను అడుగుతుంది. రాధా తన సొంత తల్లి కాదంట. ఆ విషయమై బాధపడుతుంది. నీకు ఎవరు చెప్పారమ్మ అంటే దేవి చెప్పింది అని అంటుంది. అందుకే ఇంటి దాకా వెళ్లి పసిబిడ్డను అలా ఒంటరిగా వదిలేయకండి అని చెప్పి వచ్చాను. దేవి ఆ బాధలో నుంచి ఎప్పుడు బయటపడుతుందో అని వెళుతుంది దేవుడమ్మ.