Devatha Serial: రాధ మాధవ్ తో దేవిని దత్తత పంపించకపోతే రిస్క్ ఆదిత్య కు కాదు.. మీకు, నాకు.. ఆదిత్యే తన తండ్రి అని దేవికి చెప్పనందుకు దేవి నన్ను క్షమించదు.. ఆదిత్యే తన తండ్రి అని తెలిసినా కూడా నువ్వు పంపించడం లేదని దేవికి తెలిస్తే మిమల్ని క్షమించదు.. దేవికి మామూలుగానే ఆదిత్య అంటే ఇష్టం.. అదే వాళ్ళ నాన్నే ఆఫీసర్ సార్ అని తెలిస్తే తన దగ్గరకు వెళ్లకుండా ఉంటుందా..!?
ఆదిత్య కూడా తన బిడ్డ దేవి అని అందరి ముందు చెబితే మీకు నాకు ఇద్దరికీ ప్రమాదం.. అందరూ ముందు మన పరువు పోవడంతో పాటు చిన్మయికి కూడా ఈ నిజం తెలుస్తుంది. మీరు ఏదో ఘనకార్యం చేశా అనుకుంటున్నారు అని రాధ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మాధవ్ రాధ మాటలు విన్న తరువాత మాధవ్ ఎలాగైనా రాధ ను నా సొంతం చేసుకోవాలి అనుకుంటాడు. దేవి ఇంటిలో నుంచి పంపించేస్తే.. దేవిని తీసుకెళ్ళినట్టుగానే రేపటి రోజున ఆదిత్య వచ్చి రాధ నా భార్య అని చెప్పి.. రాధను కూడా ఇంట్లో నుంచి తీసుకు వెళ్ళిపోతాడు. అప్పుడు చిన్మయికి అమ్మ లేకుండా ఒంటరిగా అయిపోతుంది అలా ఎప్పటికీ జరగకూడదు.
దేవి ఇంట్లో నుంచి వెళ్ళిపోకుండా చేయాలి. అప్పుడు రాధ కూడా ఇంటి నుంచి బయటకు వెళ్ళదు. అప్పుడు చిన్మయికి తల్లి లేని లోటు లేకుండా చేయచ్చు. అలా జరగాలంటే రాధ ను నేను పెళ్లి చేసుకోవాలి. రాధను పెళ్లి చేసుకుంటే నాకు రాధ పై హక్కు వస్తుంది. ఆ హక్కు ఉంటే రాధ నా మాట కాదు అనదు అని అనుకుంటాడు మాధవ్..