ట్రెండింగ్ న్యూస్ సినిమా

Devatha Serial: సత్యకే పిల్లలు పుట్టరని రాధ తెలుసుకుంటుందా..!? దేవిని చెల్లెలి కోసం ఇచేస్తుందా..!?

Share

Devatha Serial: దేవి ఇంట్లో తన ఫ్రెండ్స్ కి చాక్లెట్లు ఇస్తానని బయటకు వచ్చి ఆఫీసర్ సార్ ను కలుస్తుంది.. ఇక ఆదిత్య తో కలిసి వాళ్ళ ఇంటికి వెళ్తుంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ దేవికి స్పెషల్ బర్త్ డే విషెస్ చెప్తారు. ఇంట్లో వాళ్ళందరూ కలిసి కేక్ కట్ చేస్తుంది దేవి.. దేవుడమ్మ అవ్వ అంటూ దేవి చెప్పే మాటలకు సంబరపడిపోతుంది..

అంతలో రాధ సత్య కు ఫోన్ చేస్తుంది. ఏంటక్కా ఈ చెల్లెలు గుర్తు వచ్చిందా. ఓ ఆదిత్య దేవి ని కలవడానికి రావద్దని చెప్పడానికి ఫోన్ చేసావా.. ఆ విషయంలో నేను నీకు ఏం హెల్ప్ చేయలేను అక్క అని సత్య చెబుతుంది. నేను ఎందుకు ఫోన్ చేశాను చెప్పనిస్తావా సత్య అని రాధ అంటుంది.. మీకు పిల్లలు పుట్టరని చెప్పావు కదా. ఏ హాస్పిటల్లో చూపించుకున్నావు. ఆ డాక్టర్ పేరేంటి అని అడిగి వివరాలు తెలుసుకుంటుంది. ఇప్పుడు ఎందుకు అక్క అని అడిగితే.. ఆ డాక్టర్ దగ్గర కాకపోతే మరో డాక్టర్ దగ్గర చెక్ చేయించుకోవచ్చు కదా.. ఒకవేళ రిపోర్ట్స్ లో ఏమైనా తేడాలు ఉన్నాయేమో అని చెబుతుంది. ఆదిత్య ను మళ్ళీ హాస్పటల్ వెళ్దాం అంటే ఇబ్బంది పడతాడు అక్క అంటుంది. సరే ఆదిత్య కు తెలియకుండా నేను నిన్ను తీసుకువెళ్తా వస్తావా అని అడుగుతుంది.. తప్పకుండా వస్తా అక్కా అని చెబుతుంది.

Devatha Serial: 28 Jan 2022 Episode Highlights
Devatha Serial: 28 Jan 2022 Episode Highlights

ఇక రేపటి ఎపిసోడ్ లో రాధా సత్య చెక్ చెప్పించుకున్న హాస్పిటల్ కి వెళ్లి నేనే సత్యనని చెప్పి రిపోర్ట్స్ లో ఏముందో అడిగి తెలుసుకుంటుంది. సత్యా గర్భసంచి ప్రాబ్లం ఉందని, ఇక ఎప్పుడూ తనకు పిల్లలు పుట్టారు అని తెలుసుకుంటుంది. తన చెల్లి కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన రాధలా ఉన్న రుక్మిణి ఈసారి సత్య ఆదిత్య సంతోషం కోసం తన బిడ్డ దేవిని వారికి ఇచ్చేస్తుందో లేదో రేపు చూద్దాం..


Share

Related posts

NTR: ఎన్టీఆర్ ఊసరవెల్లి సినిమా.. ఫస్ట్ చేయాల్సిన హీరో ఎవరో తెలుసా..??

sekhar

మ‌న్మ‌థుడు 2లో స‌మంత పాత్ర

Siva Prasad

కన్‌ఫ్యూజన్ లో దిల్ రాజు ..!

GRK
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar