Devatha Serial: ఆదిత్య ఇంటికి రాగానే సత్య ఏడుస్తూ తన కి దండం పెడుతుంది.. ఏమైంది అమ్మా సత్య ఏంటి అలా ఉంది అని అడిగితే ఏం కాలేదు ఆదిత్య.. చిన్న విషయమే అని.. తనకి నిజం తెలిసిపోయింది అని అంటుంది దేవుడమ్మ.. సత్య ఏడుస్తూ ఇన్ని రోజులు లోపం నీలో ఉందని నిన్ను చాలా బాధపెట్టాను. నన్ను క్షమించు ఆదిత్య అని తన కాళ్ళు పట్టుకుని ఏడుస్తుంది. ఇక నేను నీ కోరిక, ఆంటీ కోరిక ఈ జన్మలో తీర్చుకోలేను. ఇక నేను బ్రతికి ఉండి ఏం ప్రయోజనం నేను చచ్చిపోతా అని సత్య అంటుంది. వెంటనే దేవుడమ్మకి కోపం వచ్చి బిడ్డలు పుట్టడం అది మన అదృష్టం. ఆడవాళ్లకు ఆ దేవుడు ఇచ్చిన వరం. ఆ అదృష్టం నీకు లేకపోతే చనిపోవడమేనా.. పిల్లలు లేకపోతే ఏమైంది మాకు మీరు మీకు మేము ఉన్నాం కదా అని అంటుంది దేవుడమ్మ..!
దేవుడమ్మ దగ్గరకి రాజమ్మ వచ్చి ఏంటి అక్క నీకు బాధగా లేదా.. పిల్లలు కావాలన్న నీ కోరిక ఇక నెరవేరదు కదా అని అంటుంది.. ఇంత కాలం పిల్లలు కోసం ఎదురు చూసా ఇక మీదట కూడా అదే ఆశతో బ్రతికేద్దాం. మేము చనిపోయిన తరువాత ఎవరు ఏమీ అడగరు కదా ఇదంతా. ఆ తర్వాత ఎవరు ఏమి పట్టించుకోరు కదా అని అంటుంది. దేవుడమ్మ మాటలు విన్న సూరి తన వదినమ్మతో అసలు నిజాన్ని చెబుతాడు.
నన్ను క్షమించు ఒదినమ్మ. నేను నీ దగ్గర ఒక విషయం దాచాను. నువ్వు నమ్ముతున్న నిజం నిజమే వదిన స్వామీజీ చెప్పింది నిజమే. రుక్మిణి ఈ ఇంటిని వదిలి వెళ్లేసరికి తను గర్భవతి. ఏంటి సూరి నువ్వు చెప్పేది.. నిజం వదినమ్మ.. మరి ఇప్పటి వరకు నాకు ఎందుకు చెప్పలేదు అని దేవుడమ్మ అడుగుతుంది. ఎవరికీ చెప్పొద్దు అని నా దగ్గర ఒట్టు తీసుకుంది వదినమ్మ.. అంటూ హాస్పిటల్ లో జరిగిందంతా చెబుతాడు సూరి వాళ్ళ వదినమ్మకు.. సూరి మాటలు విన్న దేవుడమ్మకు రుక్మిణీ బ్రతికే ఉందన్న నిజం గుర్తుకు వస్తుంది. ఇక దేవుడమ్మ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో రేపటి ఎపిసోడ్ లో తెలుసుకుందాం.