Devatha Serial: దేవి ఎక్కడికి వెళ్లిందో వెతికే ప్రయత్నంలో.. రాధ దేవి ఎక్కడ ఉందో నాకు తెలుసు అక్కడి పదా పెనిమిటి అంటుంది.. కచ్చితంగా అక్కడ ఉంటుంది అని పొలం దగ్గరకు తీసుకు వెళ్తుంది.. తీరా వెళ్లి చూస్తే దేవి అక్కడ ఉంటుంది.. ఎంది బిడ్డా ఇక్కడ కూర్చున్నావ్ అని రాధ అడుగుతుంది. ఇక్కడ కూర్చుంటే దేవుడు వచ్చి బాధ వింటాడు అని అన్నవ్ కదా అందుకే నా బాధ వింటాడని ఇక్కడ కూర్చున్నా అంటుంది..
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
నువ్వు ఏమో ఈ ఆఫీసర్ సార్ దగ్గరకి వెళ్ళమంటావు. నాకేమో నిన్ను వదిలి వెళ్ళడం ఇష్టం లేదు.. ఆ మాట దేవుడికి చెప్పి నన్ను అమ్మా దగ్గర ఉంచమని అడుగుదాం అని అడుగుతా అని అంటుంది. దేవి మాటలు విన్న రాధ ఆయన ఎవరో నీకు తెలుసా.. ఆయన ఎవరో తెలిస్తే నువ్వు ఈ మాట అనవు అని ఆదిత్య నీ తండ్రి అని చెప్పేలోగా.. ఆదిత్య మనసు కరిగి నువ్వు ఎక్కడికి రావాల్సిన అవసరం లేదు.. నువ్వు నీ అమ్మ దగ్గర ఉండచ్చు. నేను నిన్ను నాతో పాటు దత్తత తీసుకెళ్ళను అని చెబుతాడు. మీ ఇద్దరిదీ 11 ఏళ్ల బంధం.. నాకు నువ్వు తెలిసిన కొద్ది రోజుల పరిచయానికే నిన్ను కావాలి అనుకుంటున్నాను. అందుకే మిమ్మల్ని విడదీయలని అనుకోవడం లేదు. నువ్వు ఆ మాట అంటున్నావు కానీ అమ్మ అనడం లేదుగా అంటుంది..
రాధ కూడా సరే అంటుంది. దేవి ఆదిత్య తో మనం ఎప్పటి లాగానే ఫ్రెండ్స్ లాగా ఉందాం అని అంటుంది. దాంతో ఆదిత్య కంటతడి పెట్టుకుంటాడు. ఆ దేవుడు మన బంధం ఇలానే రాసి పెట్టినట్టు ఉన్నాడు అని అంటాడు. అంతలో మాధవ్ వస్తాడు. దేవిని దగ్గరకు తీసుకుంటాడు. ఆఫీసర్ సార్ నన్ను దత్తత తీసుకోనని చెప్పాడు నాన్న అని అంటుంది. ఇవ్వడానికి కూడా ఇక్కడ ఎవ్వరూ సిద్దంగా లేరు లేమ్మా అని మాధవ్ దేవిని తీసుకుని ఇంటికి వెళతాడు.