Devatha Serial: మాధవ్ మాటలు విన్న ఆదిత్య రాధా కోసం పొలం దగ్గరికి వస్తాడు.. ఆదిత్య రావటం గమనించిన రాధా పెనిమిటి ఏంటి ఇటు వస్తున్నాడు.. నా కోసమేనా.. ఏం అడిగినా బరాబర్ కాదని చెప్పాలి అని మనసులో అనుకుంటుంది..!! ఏం చేశారు.. ఏం చెప్పారు పిల్లలకి..!? చూడగానే పరుగులు వచ్చే ఆ పిల్లల పసి హృదయంలో ఏం విషయం నింపారు అంటూ రాధను ప్రశ్నిస్తాడు..!?
460 ఎపిసోడ్ హైలైట్స్..
రుక్మిణి దూరమైన తరువాత దేవి లో మళ్లీ అంత సంతోషాన్ని చూస్తున్న దేవి దూరమైతే నేను ఉండలేను. రోజులో ఒకసారి, వారానికి ఒకసారి, లేదంటే నెలకు ఒకసారైనా దేవిని చూసే అనుమతి రాధను ఇవ్వమని వేడుకుంటాడు.. మా పిల్లలు ఎవరి దగ్గరికి రారు.. వెళ్ళమని కూడా నేను చెప్పను అని చెబుతుంది.. నిన్ను చూస్తుంటే అచ్చం నా రుక్మిణి నేను చూస్తున్నట్టే ఉంది.. రుక్మిణి నువ్వే నా ప్రాణం నువ్వు లేకుండా నేను ఉండలేను అంటే తను నా గుండెల మీద తన్నేసి నా బిడ్డను నాకు దూరం చేసి వెళ్ళిపోయింది.. ఇప్పుడు నువ్వు కూడా దేవి అంటే నాకు ఇష్టం చూడకుండా ఉండలేను అంటే కనీసం ఒక్క రోజు చూడడానికి ఒప్పుకోకుండా డా దేవిని నాకు దూరం చేస్తున్నావ్ మీ ఆడవాళ్ళంతా ఇంతేనా.. ప్రాణంగా ప్రేమించే వాళ్ళని పట్టించుకోరు.. ప్రేమంటే తెలియని వారి దగ్గర ప్రేమ వెతుక్కుంటారు.. అందుకే ఆడవారి ప్రేమ కోసం చచ్చిపోయే మగాళ్ళు ఉంటారు కానీ.. ఆడవాళ్ళు ఒక్కరైనా ఉంటారా ఎందుకు ప్రేమంటే అంత చులకనా.. ప్రేమను, అభిమానాన్ని అర్థం చేసుకోకుండా మీరు ఎప్పటికీ మారరా.. ఏడిపించడం మగాడి బలహీనత.. ఎలాంటి ప్రియమైన తిరస్కరించడం మీ ఆడవాళ్ళ బలం.. దేవి మీద ఉన్న ప్రేమను మీరు తెలిసే నాకు దూరం చేస్తున్నారు.. అప్పుడు రుక్మిని నన్ను వదిలేసి వెళ్లి ఏడిపిస్తుంది ఇప్పుడు నువ్వు దేవిని నాకు దూరం చేసి ఏడిపిస్తున్నావు అంటూ బాధపడుతూ అది అక్కడనుంచి వెళ్ళి పోతాడు..
ఆ కోపంలో ఉన్నా ఆదిత్య ఇంటికి వస్తాడు. కమల రా మరిది అంటూ తను చేసిన మునక్కాడల ఐటమ్స్ ఎదురుగా పెడుతుంది. కోపం వచ్చినా ఆదిత్య వాటిని విసిరికొడతాడు. దాంతో అక్కడి నుంచి వెళ్ళిపోయి భాషతో ఆదిత్య మనకి బహుమతి ఇస్తానంటాడు అని చెబుతుంది. భాషా కమల చెప్పే మాటలు వినకుండా పటేలా బహుమతి ఇస్తాను అన్నావ్ అంట నాకు బహుమతి ఏమీ వద్దు కానీ జీతం పెంచు అని అంటాడు. వెంటనే ఆదిత్య చెంపమీద ఒకటి పీకుతాడు.. అక్కడే ఉన్న ఆదిత్య వాళ్ల పిన్ని భాషకు మునక్కాడల కూడా విసిరికొట్టాడని సైగ చూస్తుంది..