ట్రెండింగ్ సినిమా

Devatha Serial: మాధవ్ సంగతి ఏంటో తేల్చనున్న ఆదిత్య.. దేవి కల నిజమవుతుందా.!?

Share

Devatha Serial: రాధ దేవి, చిన్మయిని నిద్ర లేపుతుంది.. దేవి ఎంత చెప్పినా కూడా నిద్ర లేవదు.. నేను నిద్ర లేగవను అమ్మ నాకు పొద్దున్నే ఒక కల వచ్చింది.. నేను నిద్ర లెగిస్తే ఆ కల నిజం అవుతుందేమోనని భయంగా ఉంది అని అంటుంది దేవి.. ఇంతకీ ఏం కల వచ్చింది అని రాధ అడుగుతుంది.. ఆఫీసర్ వచ్చి నన్ను వాళ్ళ ఇంటికి తీసుకువెళ్లాడు.. మిమ్మల్ని ఎవరిని బాధపెట్టకుండా నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు.. నేను నిద్ర లెగిస్తే ఆ కల నిజమవుతుందని నాకు భయంగా ఉంది అని అంటుంది దేవి..!

Devatha Serial: 3 May 2022 Today Episode Highlights
Devatha Serial: 3 May 2022 Today Episode Highlights

మాధవ్ ఎందుకు దేవిని దత్తత ఇవ్వను అన్నాడు. చిన్మయి నే ఎందుకు దత్తత ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. తన సొంత బిడ్డ కానీ దేవిని దత్తత ఇవ్వడానికి ఒప్పుకోలేదు కానీ.. తన కన్న కూతురైన చిన్మయి ని ఎందుకు దత్తత ఇస్తాను అంటున్నాడు. రాధ చినమయిని అయితే నేను దత్తత తీసుకోనని తెలిసి కావాలని చిన్మయిని దత్తత ఇస్తానని చెప్పిన మాట లో ఏదో తేడాగా ఉంది.. మాధవ్ మనసులో ఏదో ఆలోచన ఉంది.. ఆ ఆలోచన ఏంటో తెలుసుకోవాలి అని… ఆ విషయం మాధవ్ తో తేల్చుకోవాలని అనుకుంటాడు ఆదిత్య..

 

ఆదిత్య మాధవ్ కు ఫోన్ చేసి బయటకు రమ్మని పిలుస్తాడు. నీతో కొన్ని విషయాలు మాట్లాడాలి అవి నీకు నాకు మధ్యన మాత్రమే ఉండాలి అని అంటాడు ఆదిత్య. మాధవ్ ఆదిత్య దగ్గరకు బయల్దేరి కారులో ఎందుకు ఇప్పుడు నన్ను ఆదిత్య పిలుస్తున్నాడు. రాధ గురించి అడుగుతాడా.. దేవి గురించి అడుగుతాడా అని అనుకుంటు ఉంటాడు. మాధవ్ తో ఆదిత్య నువ్వు నాకు చిన్మయిని దత్తత ఇస్తాను అని అన్నావు కదా అంటాడు.. హా.. అవును అన్నాను అని అంటాడు మాధవ్.. ఆదిత్య మాధవ్ మాటల్లో ఉన్న ఆంతర్యం ఏమిటో తెలుసుకుంటాడా లేదా అనేది తరువాయి భాగంలో తెలుసుకుందాం.


Share

Related posts

The Kashmir Files: ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమా డైరెక్టర్ కి పొంచివున్న ప్రమాదం.. ‘వై’ కేటగిరీ భద్రతను కల్పించిన కేంద్రం!

Ram

HBD Vijaydeverakonda: దేశం నిన్ను చూసి అంటూ విజయ్ దేవరకొండకి బర్త్ డే విషెస్ చెప్పిన పూరి జగన్నాథ్..!!

sekhar

Katti Mahesh: బ్రేకింగ్..లారీని ఢీకొన్న సినీ నటుడు కత్తి మహేష్ కారు..నెల్లూరు జిల్లాలో ఘటన..

somaraju sharma
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar