Devatha Serial: స్టార్ మా లో ప్రసారం అవుతున్న సీరియల్స్ లో దేవత సీరియల్ కూడా ఒకటి.. అనుబంధాలకు నిలయం దేవత సీరియల్.. తన చెల్లి భవిష్యత్తు కోసం తన జీవితాన్ని ధారపోసిన అక్క కథే ఈ సీరియల్.. తాజాగా విడుదలైన టీవీ సీరియల్స్ టిఆర్పి రేటింగ్స్ లో దేవత సీరియల్ 9.88 రేటింగ్ ను సొంతం చేసుకొని మూడవ స్థానంలో నిలిచింది.. గత కొద్ది వారాలుగా ఈ సీరియల్ మూడవ స్థానాన్ని కైవసం చేసుకుంటే వస్తుంది.. ఈ వారం జరిగిన హైలెట్స్ తోపాటు వచ్చేవారం ఏం జరుగుతుందో చూద్దాం..!
సూరి తన వదినమ్మ దేవుడమ్మకి రాధ ఇంటి నుంచి వెళ్లిపోయే సరికి తను గర్భవతి అని.. ఆ నిజాన్ని ఎవరికీ చెప్పవద్దని రుక్మిణీ తన దగ్గర ఒట్టు తీసుకుందని చెబుతాడు సూరి. ఈ విషయం తెలిసిన దేవుడమ్మ ఆ స్వామిజి చెప్పినట్టు ఆదిత్య కు పిల్లలు పుట్టే అవకాశం ఉందని అది నిజమని తెలుసుకుంటుంది. అదేవిధంగా రుక్మిణీ బ్రతికే ఉంది అని కూడా ఆ స్వామీజీ చెప్పారు. కాబట్టి కచ్చితంగా రుక్మిణీ ఎక్కడో ఒకచోట బ్రతికే ఉంటుందనీ తనని వెతికే పనిలో బిజీగా ఉంటుంది దేవుడమ్మ..
భాగ్యమ్మ సత్య కి పిల్లలు పుట్టారు అని తెలిసినా కూడా కమలా, భాష తమకు పుట్టబోయే బిడ్డలో సత్య కి ఇవ్వడానికి ఒప్పుకోదు. ఒకవేళ భాగ్యమ్మ ఏమైనా నోరు జారి రుక్మిణీ బతికే ఉందని.. ఆ రుక్మిణీకి పుట్టిన బిడ్డ దేవి అని.. దేవి ఉండగా ఆదిత్య కు మీ బిడ్డను దత్తత ఇవ్వాల్సిన అవసరం లేదని భాగ్యమ్మ నోరు జారి చెబుతుంది. ఈ విషయం తెలుసుకున్న దేవుడమ్మ రుక్మిణీ ఎక్కడ ఉందో తెలుసుకుంటుంది. వచ్చేవారం ఇదే హైలెట్ సీన్ కానుంది..