Devatha Serial: రుక్మిని ఆదిత్య కి ఫోన్ చేసి ఎప్పుడు మనం కలిసే ప్లేస్ కి త్వరగా రమ్మని చెబుతుంది.. మీకు అర్జెంటుగా ఒక విషయం చెప్పాలి అని అంటుంది.. ఆదిత్య దేవికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో చదవడానికి సీటు వచ్చింది.. తను నాకంటే పెద్ద ఆఫీసర్ పొజిషన్ లో ఉంటుంది అని అని సంబరంగా చెబుతాడు ఆదిత్య.. అంతలో రుక్మిణి దత్తత విషయం ఇంట్లో చెబుదాము అనుకున్నాను. కానీ చెప్పడం నావల్ల అయితలేదు అని అంటుంది. నీ వల్ల ఏది కాదు.. నేనే దేవికి నిజం చెప్పేస్తాను అని అంటాడు..!
రేపు ఉగాది చాలా మంచి రోజు ఏదో ఒకటి చేసి దేవిని నాకు దగ్గర చేయని ఆదిత్య అంటాడు. ఈ ఉగాదికి నీకు నీ బిడ్డ దగ్గర అవుతది. నాకే నా బిడ్డ దూరం అవుతాది. నా జీవితంలో ఇక నా బిడ్డ తో చేసుకునే ఆఖర పండగ ఇదే. లేదు రుక్మిణి నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు దేవిని చూడడానికి రావచ్చు అని ఆదిత్య చెబుతాడు. నేను నీ జీవితంలోకి ఎలా వస్తాను నేను ఎప్పుడో చనిపోయాను కదా.. ఈ ఒక్క దినం నా బిడ్డ తో నేను సంతోషంగా గడపాలి. జీవితాంతం తన జ్ఞాపకాలతో బ్రతికినంత ఆనందంగా జరుపుకోవాలి అని అక్కడి నుంచి వచ్చేస్తుంది.
ఇక దేవి ని పెళ్లి కూతురి మాదిరిగా ముస్తాబు చేస్తుంది. చీర కట్టి నగలు కూడా పెడుతుంది. రేపు నీ పెళ్లికి ఈ అమ్మ వచ్చి నిన్ను ముస్తాబు చేయలేదుగా.. అందుకే నా ముచ్చట్లు అన్నీ ఇప్పుడే తీర్చుకుంటున్న నిన్ను చిన్నారి పెళ్లికూతురు ముస్తాబు చేసి మీ నాన్న ఇంటికి సంతోషంగా పంపిస్తానని రాధ మనసులో అనుకుంటుంది. దేవిని అచ్చమైన తెలుగింటి అమ్మాయిలా చూస్తే కళ్లు కుట్టుకునెంత అందంగా రెడీ చేస్తుంది రాధ. ఆ అందానికి చిన్న దిష్టి చుక్క కూడా చాలలేనంత ముద్దుగా ఉంటుంది దేవి.. రాధ దేవికి ఏం చెప్పి ఆఫీసర్ ఇంటికి పంపిస్తుందో తరువాయి భాగంలో తెలుసుకుందాం.