Devatha Serial: రాధ మాధవ్, రాముర్తి, జానకమ్మ లను తీసుకొని ఒకరి ఇంటికి వెళ్తుంది. తీరా ఆ ఇంటికి వెళ్ళిన తరువాత మాధవ్ కి పెళ్లి సంబంధం చూసినట్లు అర్థమవుతుంది. మాధవ్ సార్ గురించి మీకు చెప్పిన కదా వెంటనే అమ్మాయిని తీసుకుని రండి అని రాధ అక్కడ హడావుడి చేస్తుంది పెళ్లికూతురు వచ్చిన తర్వాత మాధవ్ ని ఆ అమ్మాయినీ చూడమని.. ఆ అమ్మాయినీ మాధవ్ ను చూడమని రాధా అంటుంది.. మీకు నచ్చితే ఇప్పుడే సంబంధం ఖాయం చేసుకుందామని పెళ్ళికూతురు తరపు వారు అంటారు మాధవ్ ఇంటికి వెళ్లి ఫోన్ చేస్తామని చెప్పమని వాళ్ళమ్మతో చెబుతాడు..!
అక్కడి నుంచి మాధవ్, రాముర్తి, జానకమ్మ ఇంటికి రాగానే పెళ్లి సంబంధం కి వెళ్తున్నాము అని ముందుగానే చెబితే మేమే ఒక మంచి సంబంధం చూసుకునే వాళ్ళం కదా.. మీకెందుకు శ్రమ అన్నట్టుగా వాళ్ళ అమ్మ అంటుంది. కానీ మేము బయట అమ్మాయిని చేసుకోవాలని అనుకోవటం లేదు. మాధవ్ గురించి తెలిసి చిన్మయికి తల్లి గా ఉండే అమ్మాయి కావాలి అనుకుంటున్నాం. అది కూడా నువ్వే కావాలి అని అనుకుంటున్నట్లుగా జానకమ్మ చెబుతుంది. మీరు పెళ్లి వద్దు అని అనుకుంటున్నారు. మాధవ్ సార్ మనసులో ఏముందో మీకు ఇంకా తెలియడం లేదు. నేను చెప్తున్నాను కదా మీరు అర్థం చేసుకోండి. సార్ కి ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేయండి అని వాళ్లకి చెబుతుంది రాధ. మొత్తానికి వాళ్ళ అమ్మనాన్నల దగ్గర మాధవ్ ను అడ్డంగా బుక్ చేసింది రాధ..
దేవి స్కూల్ దగ్గరికి వెళ్లిన ఆదిత్య దేవిని కలిసి మాట్లాడుతాడు. ఈమధ్య నువ్వు అదోలా ఎందుకు ఉంటున్నావు అని అడుగుతాడు. దేవి జరిగినదంతా చెబుతుంది. నువ్వు ఇంత చేసినా మీ అమ్మ నిన్ను కొట్టలేదా అని అడుగుతాడు. మీ అమ్మ నిన్ను కొట్టలేదు అంటే కచ్చితంగా తనే మీ అమ్మ. నువ్వు ఎంత బాధపెట్టినా ఒక్క తల్లి మాత్రమే నిన్ను కొట్టకుండా తనలో తను బాధపడుతుంది. ఇంకొకసారి ఎప్పుడు అమ్మ దగ్గర అలా నడుచుకోకు.. అమ్మను బాధ పెట్టకు అని ఆదిత్య దేవి మనసులో ఉన్న సందేహాలను మొత్తం నివృత్తి చేస్తాడు.