Devatha Serial: ఆదిత్య మాధవ్ ను నీ బిడ్డ అయినా చిన్మయిని అలా ఎలా దత్తత ఇస్తావు అని అడుగుతాడు.. నేను ఇప్పటికీ అదే మాట ఉంటాను నీకు కావాలి అంటే.. నేను చిన్మయిని దత్తత ఇవ్వడానికి నేను సిద్ధమే అని అంటాడు.. అలా ఎలా మాట్లాడుతున్నావ్ మాధవ్ ఎలా ఇస్తావు మాధవ్ అని అంటాడు ఆదిత్య.. నీకు ఇంకొక ఆఫర్ ఇస్తున్నాను.. నువ్వు దత్తత తీసుకుంటాను అంటే.. ఇప్పటికి కూడా నీకు దత్తత ఇవ్వడానికి నేను సిద్ధమే.. చిన్మయిని నేను నీకు దత్తత ఇచ్చినా హ్యాపీగానే ఉంటాను.. నువ్వు తీసుకోకపోయినా నేను సంతోషంగానే ఉంటాను.. అందుకు నా కారణాలున్నాయని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మాధవ్..!
నేను ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లల్ని వదులుకోను.. అందుకు నా ప్లాన్స్ నాకున్నాయి అనుకుని మాధవ్ ఇంట్లోకి వస్తూ పిల్లలు ఈ నాన్న మీ కోసం గిఫ్ట్ తెచ్చాడు.. ఉండండి చూపిస్తాను అని ఒక గోల్డ్ చైన్ దేవికి, మరొకటి చిన్మయి కి ఇస్తాడు.. దేవి చైన్ డాలర్ లో M అని M అంటే మాధవ్ అని.. చిన్మయి మెడలో R అని అంటే రాధని అమ్మంటే నాకు ఇష్టమని కదా.. నాకు కూడా ఇష్టమే కదరా అని అంటాడు మాధవ్.. దాంతో కోపంగా రాధ అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
రాధా మనసులో ఏదో ఆలోచిస్తూ ఉందని తెలుసుకున్న రామ్మూర్తి, జానకమ్మ ఇద్దరూ నువ్వు ఇదివరకటి లాగా ఉండటం లేదు.. ఎవరితోనూ సరిగ్గా మాట్లాడటం లేదు.. మౌనమే నీ సమాధానం అయింది.. ఎందుకు ఇలా ఉన్నావు రాదా అని ఇద్దరు అడుగుతారు. నీ మనసులో ఏమైనా కష్టం ఉంటే మాతో పంచుకోమని ఆప్యాయంగా అడుగుతారు.. వాళ్ళ మాటలు విన్న రాధ తన మనసులో ఉన్న నిజాన్ని వాళ్లకు చెబుతుందా లేదా అనేది రేపటి ఎపిసోడ్ లో తెలుసుకుందాం..
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!