Devatha Serial: దేవి వాళ్ళ స్కూల్ అన్యువల్ డే ఫంక్షన్ కు ఆదిత్యను చీఫ్ గెస్ట్ గా పిలుస్తారు.. ఆదిత్య తన భార్య సత్యతో కలిసి ఆ ఫంక్షన్ కు హాజరవుతారు.. అదే ఫంక్షన్ కు వచ్చిన రాధను సత్య పలకరిస్తుంది.. ఆదిత్య రాగానే స్కూల్ ప్రిన్సిపాల్ వెళ్లి రిసీవ్ చేసుకుంటాడు.. ఆదిత్య కు స్కూల్ పిల్లలతో చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేశారు స్కూల్ ప్రిన్సిపల్..!
పిల్లలందరినీ లైన్లో నిల్చోబెట్టి రెడ్ రోజెస్ ఇస్తూ పిల్లలచేత ఆదిత్యకు గ్రాండ్ వెల్కం చెబుతారు స్కూల్ యాజమాన్యం అది చూసి ఆదిత్య చాలా సంతోషపడ్డాడు పక్కనే ఉన్న రామూర్తి గారు దేవి చిన్మయి వాళ్లను కూడా ఆఫీసర్ కి పువ్వులు ఇవ్వమని చెబుతారు చిన్మయి ఆదిత్యకు ఫ్లవర్ ఇచ్చి వెల్కమ్ సార్ అని చెబుతుంది. దేవి ఆఫీసర్ సార్ కు గులాబీ పువ్వు ఇవ్వకుండా దానిని నేలకు విసిరికోడుతుంది. అది చూసిన స్కూల్ ప్రిన్సిపాల్ దేవిని అరుస్తుండగా.. ఆదిత్య అందరి ముందు దేవుని అరవకండి. తన మనసును నొచ్చుకుంటుంది అని అంటాడు. ఇక అందరూ అక్కడి నుంచి వెళ్లిపోయాక దేవి విసిరేసిన గులాబీ పువ్వు ని తీసి తన జేబులో పెట్టుకున్నాడు. అది చూసిన రాదా కన్న బిడ్డ మీద నీకున్న ప్రేమ ఏమిటో నాకు అర్థమవుతుంది పెనిమిటి. ఎలాగైనా నీకు దేవిని దగ్గర చేయాలని మనసులో అనుకుంటుంది.
దేవి, చిన్మయి ఇద్దరు అమ్మ ప్రేమను అభివర్ణిస్తూ ఎవరు రాయగలరు అనే పాటను ఇద్దరూ చాలా చక్కగా పాడతారు. అది చూసిన ఆనందంతో వారు వాళ్లు ఇద్దరూ చూడటానికి వేరు వేరు కానీ.. వాళ్ళిద్దరి ప్రాణం ఒకటే.. దేవి పక్కన ఉంది కాబట్టి చిన్మయి అంత చక్కగా పాట పాడగలిగింది.. వాళ్ళిద్దరినీ ఎప్పటికీ దూరం చేయవద్దు రాదా అని మాధవ్ అడుగుతాడు.