Devatha Serial: అక్క చెల్లెళ్ల అనుబంధాన్ని వినూత్న రీతిలో చూపిస్తూ.. ఒకరికోసం ఒకరు చేసే త్యాగాలను విభిన్నంగా తెరకెక్కిస్తు ప్రేక్షకులను టీవి కట్టిపడేస్తుంది ఈ సీరియల్.. వచ్చే వారం మొత్తం ఏం జరగనుందో ప్రత్యేక కథనం మీకోసం..!
మాధవ్ వెళ్లిపోవడం చూసిన ఆదిత్య వెంటనే కారు తీసుకుని ఇంటికి వస్తాడు.. పరుగు పరుగున దేవిని పలకరించాలని లోపలకి వస్తాడు. అంతలో ఆదిత్య రావడం చూసిన రాధ ఏంటిది ఇంత జరిగినా మళ్ళీ ఎందుకు వచ్చావు అంటుంది. ఇక అదిత్యని గుమ్మంలో నుంచి బయటికి పంపించాలని రాధ ఆలోచిస్తుంది. ఇంతలోకి పిల్లలు రాకుండా చూస్తుంది. ఎన్ని చెప్పినా ఆదిత్య లోపలికి వెళ్లడానికి ప్రయతిస్తాడా..!? దేవి తో వెళ్లి మాట్లాడతాడా..!?
ఆదిత్య ఇంటికి వచ్చిన విషయం మాధవ్ తెలుసుకుంటాడా..!? ఆదిత్య దేవిని కలిసిన విషయం తెలుసుకున్న మాధవ్.. ఇక పిల్లల్ని హాస్టల్ కి పంపిస్తాడా.. ఈ సారి మాధవ్ ఎవ్వరూ చెప్పినా వినకుండా హాస్పటల్ కి పంపుతాడా పిల్లల్ని అంటే.. ఆదిత్య దేవి ని కలిస్తే మాత్రం ఖచ్చితంగా మాధవ నిర్ణయం ఇలాగే ఉంటుంది. రాధ ఏదో ఒకటి చేసి ఆదిత్య ను ఇంటికి పంపి చేస్తుంది. పిల్లలకు దూరంగా ఉంచుతుంది. ఇలానే జరుగుతుందా.. లేదంటే ఏమైనా మార్పులు జరుగుతాయో వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం.