Devatha Serial: ఆదిత్య ను వదిలి దేవి, దేవి ని వదిలి ఆదిత్య ఉండలేరని నిన్నటి ఎపిసోడ్ తో అర్థం అయిపోయింది.. ఇక అదే ఆనందంతో ఇంటికి వెళ్ళినా ఆదిత్య వాళ్ళమ్మను.. చిన్నప్పుడు నేను దూరంగా వెళ్లి నీ దగ్గరికి వచ్చినప్పుడు నన్ను ముద్దు పెట్టుకుంటావో అలా ఒక సారి ముద్దు పెట్టుకో అమ్మ అని అడుగుతాడు.. వాళ్ళమ్మ అలాగే ముద్దు పోగొట్టుకోవడం తో అమ్మ ప్రేమ ఎప్పుడూ ఒకేలా ఉంటుంది అంటాడు.. ఆదిత్య నువ్వు ఎంత సంతోషంగా చూసి చాలా రోజులు అయింది అని అనుకుని.. దీనికి కారణం దేవి అని తెలుసుకుని ఎందుకో తన మీద అంత ప్రేమ చూపిస్తున్నాడు అనుకుంటారు.. నేటి 443 వ ఎపిసోడ్ హైలెట్స్ ఎలా ఉన్నాయి..
మరోవైపు దేవి చేసిన పనిని తలుచుకుంటూ రాధా ఈ రోజు భోజనం తినటానికి కూడా రాదు. దాంతో పిల్లలిద్దరూ వాళ్ళ అమ్మ ని అన్నం తింటానికి రమ్మంటారు అలా దేవి రాధా మధ్య సంభాషణలు జరుగుతూ ఉండగా మాధవ్ వస్తాడు నన్ను మోసం చేయాలని ఎలా అనిపించింది దేవి అని అంటాడు. దేవి కూడా చిన్న పిల్లల్ని చేసి నువ్వు మా దగ్గర మాట తీసుకున్నావు కదా.. ఇంతటితో చెల్లు అనేసి అక్కడి నుంచి పిల్లలు వెళ్ళిపోతారు.. ఇక మాధవ్ దేవికి అచ్చం తన తండ్రి పోలికలు వచ్చాయని నువ్వు మాట ఇస్తే దాని మీదే ఉంటావు. త్వరగా ఎవరితోనూ మాట్లాడవు. కానీ దేవి అలా కాదు తను ఇచ్చిన మాట మీద నిలబడ్డదు. అందరితో చాలా హ్యాపీగా ఉంటుంది. తన తండ్రి పోలికలు వచ్చాయని తెలుస్తుంది. నువ్వు అదే విషయం గురించి ఆలోచిస్తూ బాధపడుతూ అన్నం తినకపోతే పిల్లలు కూడా తినరు అలా ఎప్పటికీ చేయొద్దు రాధ అంటూ అక్కడి నుంచి మాధవ్ వెళ్ళిపోతాడు.
మరోవైపు సత్య ఆదిత్య తో దేవితో మరీ అంత చనువుగా ఉండదు ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకు ఇష్టం లేదు అంటుంది నువ్వు అలా దగ్గర అయితే ఇండైరెక్ట్‌గా దేవిని ఇబ్బంది పడతారు అని చెబుతుంది.. దాంతో కోపం వచ్చి పిల్లల్ని అలా కూడా చేస్తారా అని అరుస్తాడు. మిగతావి రేపటి ఎపిసోడ్ లో తెలుసుకుందాం.