ట్రెండింగ్ న్యూస్ సినిమా

Devatha Serial: దేవి పుట్టినరోజుకి దేవి అడిగిన గిఫ్ట్ ఆదిత్య ఇస్తాడా..!? ఇంతకీ ఏం అడిగిందో తెలుసా..!?

Share

Devatha Serial: స్కూల్ దగ్గరికి వెళ్లి ఆదిత్య దేవి కి ఒక గిఫ్ట్ ఇస్తాడు.. ఐపాడ్ మస్తు ఉన్నది సార్ అని చెప్తుంది. అంతలో పిల్లలు వచ్చి రేపు మీ పుట్టినరోజు కి చాక్లెట్స్ ఇస్తావు కదా అని అడుగుతారు.. దేవి రేపు నీ పుట్టినరోజు కదా మర్చిపోయాను నీకు ఏం గిఫ్ట్ కావాలో అడుగు అంటాడు.. ఏం అడిగినా ఇస్తావా అంటుంది. నువ్వు ఏమి అడిగినా కాదనకుండా ఇస్తాను అని ఆదిత్య చెబుతాడు. నాకు ఆవేం వద్దు గానీ నా పుట్టినరోజుకి అందరికంటే ముందుగా విష్ చేయాలి అంటుంది..

Devatha Serial: Today Episode Highlights
Devatha Serial: Today Episode Highlights

దేవి నిద్రపోతుండగా ఫోన్ మోగుతుంది.. ఆఫీసర్ సార్ ఫోన్ చేశారని నిదానంగా లేచి మాట్లాడుతుంది ఒకసారి బాల్కనీ లోకి రమ్మని పిలుస్తాడు హ్యాపీ బర్త్ డే అంటూ బెలూన్స్ తో విషెస్ చెప్తారు. ఒకసారి అలాగే కిందికి చూడు అనగానే ఆఫీసర్ కనిపిస్తాడు వెంటనే కిందకి రమ్మని సైగ చేస్తాడు.. ఇక నీకు ఒక గిఫ్ట్ తెచ్చాను అని లంగా జాకెట్ తనకి బహుమతిగా ఇస్తాడు. ఇదంతా పై నుంచి రాధ చూస్తూనే ఉంటుంది. దేవి డ్రెస్ చాలా బాగుందని ఇలాంటి డ్రెస్సులు అంటే నాకు చాలా ఇష్టమని చెబుతుంది. మరి రేపు ఈ డ్రెస్ వేసుకుంటావా.. మా నాయనా ఈ డ్రెస్ వేసుకుంటే అరుస్తాడు కదా అని అంటుంది.. లే నువ్వు ఇచ్చినంత వేసుకున్న ఉంటానా కచ్చితంగా వేసుకుంటా అంటుంది. ఈ డ్రెస్ వేసుకొని మా ఇంట్లో ఫంక్షన్ కి వస్తావా అని అడుగుతాడు. మరి మా నాన్న సంగతి అంటే నేను చూసుకుంటాగా అంటాడు.

Devatha Serial: Today Episode Highlights
Devatha Serial: Today Episode Highlights

ఇక ఉదయం దేవి నిద్ర లేవగానే వాళ్ళ నాన్న వచ్చి విష్ చేసి కొత్త డ్రెస్ ఇస్తాడు. వాళ్ళ అమ్మ దేవుడి దగ్గర పెట్టుకుని వేసుకోమని చెబుతుంది. దేవి దేవుడికి దండం పెట్టుకుని ఎవ్వరూ చూడకుండా ఆ డ్రెస్ మీద పసుపు కావాలని పడేస్తుంది. ఇలాంటి డ్రెస్ వేసుకుంటే స్కూల్లో మా ఫ్రెండ్స్ ఆటపట్టిస్తారు. నా దగ్గర వేరే డ్రెస్ ఉందని ఆఫీసర్ ఇచ్చిన డ్రెస్ వేసుకుంటుంది. ఇది ఎక్కడిది అని అడగగా తాత ఇచ్చాడు అని కవర్ చేస్తుంది. వాళ్ల తాతయ్యకు ఈ డ్రెస్ నేనే ఇచ్చాను అని చెప్పమని దేవి సైగ చేస్తుంది. రాధా అడిగితే ఆ ఈ డ్రెస్ నేనే ఇచ్చాను అని వాళ్ళ తాత చెప్తాడు. ఇక మాధవ ఈ డ్రెస్ వేసుకున్నావేంటి అని దేవి నీ అడుగుతాడు. తాత ఇచ్చాడు అని చెబితే మాధవ ఆ డ్రెస్ ఇచ్చింది ఆదిత్య అని తెలుసుకుంటాడా.‌. ఈ రోజు వల్ల ఇంట్లో జరిగే పూజ కి దేవిని పంపిస్తాడో లేదో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.


Share

Related posts

రూ.7 కోట్ల విలువైన ప్రశ్న ఇదే!

Teja

Prabhas krishnam Raju : రాధేశ్యామ్ సెట్స్ నుంచి విడుదలైన ఫోటో… పండగ చేసుకుంటున్న ప్రభాస్ అభిమానులు..!

Teja

లేపాక్షి ఆలయాన్ని దర్శించుకున్న సీపీ సజ్జనార్

Mahesh
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar