Devatha Serial: రుక్మిణీని చూసిన వెంటనే పరుగు పరుగున ఇంటికి వెళ్లిన సూరి.. చూసింది చెప్పేలోగా ఏమైందంటే.!?

Share

Devatha Serial: మాటీవి లో ప్రసారమవుతున్న దేవత సీరియల్ అందరినీ అలరిస్తు రోజుకో మలుపు తిరుగుతుంది..!! సూరి రాధలా ఉన్న రుక్మిణి ని చూసి.. కంగారు గా ఇంటికి వెళతాడు.. ఇంతకీ ఆ విషయాన్ని ఇంట్లో వాళ్ళందరూ చెబుతాడా..!? ఒకవేళ చెబితే ఇంట్లో వాళ్ళందరూ ఏం చేద్దాం అనుకున్నారు..!? ఏం జరిగిందో..!? ఈరోజుటి 435 ఎపిసోడ్ గురించి తెలుసుకుందాం!!

Devatha Serial: Today Episode Updates
Devatha Serial: Today Episode Updates

సూరి ని దేవుడమ్మా పిలుస్తారు.. ఏంటి వదినా అని అడగగా రామ్మూర్తి గారి ఊరిలో బంగారం బాగా మెరుగు పడతారు అంట వెళ్లి మెరుగు పెట్టించుకుని రా అని అని చెబుతుంది.. సూరి భాషా ని నడుం నొప్పి అంటూ డ్రామా చేస్తాడు.. అక్కడే ఉన్న భాషా ని ఆ పని చేయమని చెబుతాడు.. అప్పుడు భాషా కమలను హాస్పిటల్ కు తీసుకు వెళ్లాలి అని చెప్తాడు.. కమల ని రేపు హాస్పిటల్ కి తీసుకు వెళ్లచ్చులే.. ఇప్పుడు వదిన చెప్పిన పని చెయ్యి అని అంటాడు.. దేవుడమ్మ సరేలే రేపు బంగారం కు మెరుగు పెట్టించులే అని వెళ్ళిపోతుంది.. భాష పటేలా మీ పేకాట గ్యాంగ్ బయటే ఉంది అని చెబుతాడు. వాళ్లు ఇంటికి ఎందుకు వచ్చారా వదిన చూస్తే ఇంకా ఏమైనా ఉందా.. భాషా అమ్మ పటేల్ కి నడుము నొప్పి తగ్గి పోయింది చూడండి అంటాడు సూరి నడుము నొప్పి తగ్గింది బంగారం మెరుగు పెట్టేస్తా అని అది తీసుకుని బయటకు వస్తాడు..

Read More: Intinti Gruhalakshmi: ఒకే ఒక్క స్కూటీ.. ఈ సీరియల్ మొత్తాన్నీ మలుపు తిప్పబోతోంది.. ఇవాళ ఎపిసోడ్ అస్సలు మిస్ అవ్వకూడదు.!!
అటుగా నడుచుకుంటూ వెళ్తుండగా స్కూల్ నుండి బయటకు వచ్చిన దేవి – చిన్మయి ను చూస్తాడు.. దగ్గరకు వెళ్తే పిల్లలు తనని చూస్తే ఇంటికి తీసుకు వెళ్ళమని అడుగుతారు.. అందుకని కనిపించకుండా పక్కన దాక్కుంటాడు..!! అంతలో దేవి అమ్మ అని పిలుస్తుంది.. ఇంతకీ దేవి వాళ్ళ అమ్మ ఎలా ఉంటుందో నేను చూడలేదు అనుకుంటాడు సూరి. ఆమె ఎవరో చూడటానికి ప్రయత్నిస్తాడు. తీరా చూస్తే ఆమె రుక్మిణి లా ఉంటుంది.. రుక్మిణి బ్రతికే ఉన్న విషయాన్ని ఇంట్లో వాళ్ళకి చెప్పాలని పరుగుపరుగున వస్తాడు.. చనిపోయింది అనుకున్నారు గుని బతికి ఉండటం ఏంటి  దేవి అమ్మ అవడం ఏంటి అనుకుంటూ ఇంట్లో కి వెళ్తాడు.. అది విన్న ఆదిత్య బాబాయ్ బాబాయ్ అంటూ పిలుస్తూ ఇంట్లో కి వెళ్ళకుండా బయటకు తీసుకు వస్తాడు.. ఆగండి బాబాయ్ నేను చెప్పేది వినండి అంటాడు. నేను అందరికీ ఒక విషయం చెప్పాలి అని చెప్పడానికి ప్రయత్నిస్తాడు.. అంతలోకి ఆదిత్య ఎలాగోలా వాళ్ళ బాబాయ్ ని బయటికి తీసుకు వస్తాడు..

Devatha Serial: Today Episode Updates
Devatha Serial: Today Episode Updates

ఏంటి బాబాయ్ ఆ విషయం అడుగుతాడు మనం చనిపోయింది అనుకున్న రుక్మిణి బ్రతికే ఉంది. నా కళ్ళతో నేను చూశానురా. అవును 24 గంటలు ఆర్ఆర్ మూర్తి గారి ఇంటికి వెళ్తూ ఉంటావుగా.. అంటే ఆ రాధే రుక్మిణి అని తెలిసి సత్య నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్తున్నారా..!? పేరుకేమో పిల్లల కోసం అని నువ్వు .. రాధా కోసం అంటూ సత్య వెళ్ళేది రుక్మిణి కోసమే కదా అని నిలదీస్తాడు..!? ఆదిత్య బాబాయ్ మేము ముందు మీకు అలాగే అనుకున్నాం కానీ.. తను మన రుక్మిణి కాదు.. రామ్మూర్తి గారి కోడలు రాధా.. తను మన రుక్మిణి కనిపించే రాధా నిజం బాబాయ్.. మీలాగే మేము ఫీలై తనని నిలదీసి చాలా ఇబ్బంది పెట్టాము.. చివరికి మాది పొరపాటు అని అర్థమైంది.. నేను నమ్మను అంటాడు సూరి.. నిజంగా ఆ అమ్మాయి రుక్మిణి కాకపోతే నన్ను ఎందుకు ఇక్కడే వాకిట్లో నిలబెట్టి అవుతున్నావు వదిన వాళ్లకు చెప్పడం ఇవ్వచ్చుగా అంటాడు సూరి.. నీలా ఆవేశపడి నువ్వే రుక్మిణి అంటూ తనని నేను చాలా ఇబ్బంది పెట్టాను.. దానివల్ల అ రాధా కాపురం ఎక్కడ కూలిపోతుందొనని ఆమె కు భయం వచ్చింది. ఇప్పుడు నువ్వు వెళ్లి అమ్మకు ఈ విషయం చెప్తే అమ్మ ఊరుకుంటుందా..!? వెంటనే వెళ్లి ఎలా ఉన్నారు మీ ని తీసుకు వస్తుంది మనకు ఆమె రుక్మిణి కాదా రాధా అని తెలిస్తే.. నిజానికి తను అనాధ ఇప్పుడు మనం వెళ్లి ఆమె రాధా కాదు రుక్మిణి అని అంటే మాధవ్ ఊరుకుంటాడా వాళ్ళ కాపురంలో కలతలు రావా.. తరువాత తను రుక్మిణీ కాదు రాదా అని రుజువైతే.. పిల్లలతో మాట్లాడితేనే ఇష్టపడని మాధవ్ నిజమేనేమో అని అనుమానం మొదలవుతుంది.. అప్పుడు రాధా కాపురం నిలబడుతుందా బాబాయ్ అని ఆదిత్య అంటాడు.. ఆ పిల్లలు ఏమైపోవాలి..!? అందుకే బాబాయ్ రాధా అచ్చం మన రుక్మిణి లో ఉన్న మాట వాస్తవమే.. అందుకని అమ్మకు చెప్పవద్దు అంటున్నాను మరి సత్తి ఎందుకు వాళ్ళ ఇంటికి వెళ్తుంది.. తన అక్క లా ఉన్న తనని చూడటానికి వెళ్తుంది.. మనం తొందరపడితే రాధా పిల్లలు ఇబ్బంది పడతారు మన ఆశ వాళ్లకి శాపం కాకూడదు బాబాయ్.. నారదునికి ఆ చెడ్డ పేరు వద్దని కామ్గా ఉండిపోయాను బాబాయ్ దయచేసి నువ్వు కూడా ఎవరికీ చెప్పొద్దు.. దయచేసి పరిస్థితి అర్థం చేసుకో బాబాయ్.. అంటూ ఆదిత్య అక్కడనుంచి వెళ్ళి పోతాడు.. సూరి ఏం చేయాలో తెలియక అయోమయంలో సతమతమవుతాడు..

Devatha Serial: Today Episode Updates
Devatha Serial: Today Episode Updates

ఇక రాధ ని ఆ ఊరిలో వాళ్ళు ఒక్క పాపను ఉయ్యాల లో వేసే ఫంక్షనుకు పిలవగా.. ఆ పాపకు పేరు తననే పెట్టమని అడుగుతారు.. ఇక్కడ చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ చేత పెట్టించండి అని రాధ అంటుంది.. ఈ ఊరికి మంచి చేసే కుటుంబం మీది అందుకే మీరే మా పాపకు పేరు పెట్టండి అని అడుగుతారు వాళ్ళు.. మంచి పేరు పెట్టాలి అంటే మంచి వాళ్ల పేరే పెట్టాలి.. రాధా మన ఊరికి కలెక్టర్ గారు మంచి చేశారు. వాళ్ళ అమ్మ గారి పేరు ఈ పాపకు పెడతాను అని అంటుంది.. నిజంగా రాధ ఆదిత్య వాళ్ళ అమ్మ పేరు పాపకు పెడితే అది మాధవ్ కి తెలిస్తే ఏమవుతుంది..!? ఎలా వాళ్ళ ఇంట్లో వారు ఈ విషయాన్ని స్వీకరిస్తారు..!? అనే విషయాన్ని రేపటి ఎపిసోడ్ లో తెలుసుకుందాం..!!


Share

Related posts

Raviteja : రవితేజ – శరత్ మాండవ ప్రాజెక్ట్ షూటింగ్ షెడ్యూల్ ప్లాన్స్ రెడీ..

GRK

Balakrishna: బాల‌య్య ఫ్యాన్స్‌కి బోయ‌పాటి గుడ్‌న్యూస్.. ఇక ర‌చ్చ ర‌చ్చే!

kavya N

జబర్దస్త్ కమెడియన్ దొరబాబు గురించి ఎవరికీ తెలియని నిజాలు…

Siva Prasad