Devi Sri Prasad: తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖ సంగీత దర్శకులు అయినటువంటి థమన్, దేవిశ్రీ ప్రసాద్ మధ్య మ్యూజికల్ వార్ జరుగుతోందనే టాక్ నడుస్తోంది. ప్రస్తుతం థమన్ హవా నడుస్తోందని వేరే చెప్పాల్సిన పని లేదు. కరోనా సెకండ్ వేవ్ తరువాత రిలీజైన ‘వకీల్ సాబ్’, ‘అఖండ’ సినిమాలు థమన్ స్థాయిని మరింత పెంచాయనే చెప్పుకోవచ్చు. దాదాపు రెండు మూడు సంవత్సరాలుగా టాలీవుడ్లో దేవి శ్రీ మాట పెద్దగా వినకపోవడం మనం గమనించవచ్చు. ప్రస్తుతం బడా హీరోలందరూ తమ ఫస్ట్ ఛాయిస్ థమన్ అనే చెప్తున్నారు.
AP Special Status: ఏపి ఆశలో నీళ్లు చల్లిన కేంద్రం .. తెలుగు రాష్ట్రాల భేటీ అజెండా నుండి ప్రత్యేక హోదా అంశం తొలగింపు..! ఎందుకంటే..?
Devi Sri Prasad: దేవి శ్రీ ప్రసాద్ బాలీవుడ్ కహాని:
తెలుగులో అవకాశాలు సన్నగిల్లుతున్న వేళ, దేవిశ్రీప్రసాద్ కి బాలీవుడ్ నుండి పిలుపు రావడం గమ్మత్తైన విషయం. అయితే దీనికి కారణం లేకపోలేదు.. ‘పుష్ప’ హిందీలో గ్రాండ్ సక్సెస్ తర్వాత బాలీవుడ్ లో దేవి పేరు మారుమ్రోగిపోతోంది. ఈ సినిమాకు దేవి ప్రాణం పోసాడనే చెప్పుకోవాలి. కాగా వరుణ్ ధావన్ తన తదుపరి చిత్రాన్ని మార్చి15 నుండి సాజిద్ నడియాడ్వాలా, నితేష్ తివారీతో మొదలు పెట్టబోతున్నాడు. ఈ చిత్రం కోసం రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ను సంగీత దర్శకుడిగా ఎంపిక చేసారని సమాచారం.
Manchu Lakshmi: ఆనందంతో ఉప్పొంగిపోతున్న మంచు లక్ష్మి..కారణం అదే..!
బాలీవుడ్లో మరో సినిమా:
ఇక అది ‘పుష్ప’ సినిమా మాయ అనుకుంటే రణవీర్ సింగ్, పూజా హెగ్డే జంటగా తెరకెక్కుతున్న ‘సర్కస్’ సినిమా కోసం DSP ఇటీవల రెండు పాటలను కంపోజ్ చేయడం జరిగింది. ఇవి మాత్రమే కాకుండా బాలీవుడ్లో పలు సినిమా దర్శక నిర్మాతలు దేవిశ్రీతో మ్యూజిక్ చేయించుకోవాలనే ఉద్దేశంతో ఉన్నారట. ఈ విషయాలు తెలిసిన కొందరు నెటిజన్స్ దేవి బాలీవుడ్ లోకి జంప్ అయిపోయాడా? అనే సందేహం సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేస్తున్నారట!
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!