న్యూస్ సినిమా

Devisriprasad: పవన్ కళ్యాణ్ పేరు చెప్పినా కాంప్రైజ్ కానంటున్న దేవిశ్రీప్రసాద్..అనవసరంగా మిస్ చేసుకుంటాడా..?

Share

Devisriprasad: పవన్ కళ్యాణ్ పేరు చెప్పినా కాంప్రైజ్ కానంటున్న దేవిశ్రీప్రసాద్..అనవసరంగా మిస్ చేసుకుంటాడా..? ప్రస్తుతం ఇదే చర్చ నెటిజన్స్ మధ్య సాగుతుందట. ఆ మధ్య కాస్త రేస్‌లో వెనకబడ్డ దేవీశీప్రసాద్ ఉప్పెన సినిమాతో మళ్ళీ తన సత్తా చాటి ఫాంలోకి వచ్చాడు. ఇక తాజాగా వచ్చిన పుష్ప: ది రైజ్ పార్ట్ 1 సినిమాకు డీఎస్పీ ఇచ్చిన సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమా సక్సెస్‌లో ప్రధాన పాత్ర పోషించాయి. ఈ సినిమా మేకింగ్ పరంగా సుకుమార్, పర్ఫార్మెన్స్ పరంగా అల్లు అర్జున్, రష్మిక మందన్నలకు ఎంత పేరొచ్చి ప్రశంసలు దక్కాయో..సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్‌కు అంతే ప్రశంసలు దక్కాయి.

devisriprasad-not compromised regarding remuniration
devisriprasad-not compromised regarding remuniration

ఇక చేతిలో పుష్ప పార్ట్ 2, పవన్ కళ్యాణ్, హరీశ్ శంకర్‌ల భవదీయుడు భగత్‌సింగ్, మెగాస్టార్ చిరంజీవి సహా పలు క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు. అయితే పుష్ప పార్ట్ 1 సక్సెస్ తర్వాత దేవిశ్రీప్రసాద్ రెమ్యునరేషన్ భారీగా పెంచేసినట్టు తాజాగా వార్తలు వస్తున్నాయి. ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలుస్తున్న దాని ప్రకారం ఇప్పుడు కమిటయ్యే సినిమాలను ఏకంగా రూ.5 కోట్లు డిమాండ్ చేస్తున్నాడట. అయితే మధ్యలో కాస్త ఈ రాక్ స్టార్ రేస్‌లో వెనకబడ్డాడు కానీ, లేదంటే సౌత్‌లో తెలుగు, తమిళ సినిమాలు చేస్తూ చాలా బిజీగా గడిపాడు. ఈ రెండు భాషలలో ఏ స్టార్ హీరో సినిమా అయినా మ్యూజిక్ డైరెక్టర్‌గా మాత్రం దేవిశ్రీనే ఎంచుకునేవారు.

Devisriprasad: ఆల్రెడీ అద్భుతమైన ట్యూన్స్ రెడీ..!

మళ్ళీ అదే జోరు ఇప్పుడు చూపిస్తున్నాడు. ఇక పవన్ కళ్యాణ్ భవదీయుడు చిత్రానికి దేవిశ్రీప్రసాద్ రూ. 5 కోట్లు అడిగినా మేకర్స్ ఇవ్వడానికి ఎస్ అన్నారట. పవన్ కళ్యాణ్ అంటే దేవిశ్రీకి ప్రత్యేకమైన అభిమానం. గబ్బర్ సింగ్ సినిమాతో అదిరిపోయే ఆల్బం ఇచ్చారు. ఆ తర్వాత వీరి కాంబినేషన్‌లో చాలా బ్లాక్ బస్టర్స్ వచ్చాయి. అంతకంటే భారీ హిట్ అయ్యే ఆల్బం భవదీయుడు చిత్రానికి ఇవ్వడం గ్యారెంటీ అని ఫిక్సవ్వాల్సిందే. అయితే క్వాలిటీ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కానీ దేవీ పవన్ కళ్యాణ్ – హరీశ్ శంకర్ సినిమాకు ఆల్రెడీ అద్భుతమైన ట్యూన్స్ రెడీ చేశాడట. త్వరలో రికార్డింగ్ మొదలబోతుందని సమాచారం.


Share

Related posts

బ్రేకింగ్: తిరుమల తిరుపతి దేవస్థానంలో కరోనా కలకలం..! 80 మందికి పాజిటివ్

arun kanna

గూగుల్ తో జియో.. కొత్త ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ షురూ..

Muraliak

Mahesh – Trivikram: హ్యాట్రికి మూవీకి ముహూర్తం ఫిక్స్ చేసిన మేకర్స్..

GRK
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar