ప్రియ‌మ‌ణి మాటలకూ కన్నీళ్లు పెట్టుకున్న రష్మీ, ప్రియమణి!

ప్ర‌ముఖ యాంక‌ర్ ర‌ష్మి గౌత‌మ్‌ను నటి ప్రియ‌మ‌ణి ఏడిపించారు. అవును ప్రియ‌మ‌ణి త‌న మాట‌ల‌తో ర‌ష్మిని స్టేజీపైనే ఏడిపించింది. కంట కన్నీరు సైతం పెట్టుకుంది. అంత‌లా ఏడిపించే మాట‌లు ప్రియ‌మ‌ణి ఏమ‌ని ఉంటారు? వారిద్ధ‌రూ క‌లిసి ప‌లు ప్రొగ్రామ్స్‌లోనూ పాల్గొన్నారు. మ‌రీ ఎందుకు ర‌ష్మీ ఏడి చారు? చూద్దాం..!

ప్ర‌ముఖ తెలుగు టీవీ ఈ టీవీలో ప్రాస‌ర‌మ‌య్యే డాన్స్ ‌ రియాల్టీ షో “ఢీ ఛాంపియన్స్‌”. ఇందులో ప్రియమణి, పూర్ణ, శేఖర్‌ మాస్టర్‌ న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్న సంగ‌తి తెలిసిందే. ర‌స‌వ‌త్త‌రంగా సాగుతున్న ఈ డాన్స్ షో ఇటీవ‌ల క్వార్ట‌ర్ ఫైన‌ల్స్‌లో అడుగుపెట్టింది. ఈ బుధ‌వారం (న‌వంబ‌ర్ -4) ప్ర‌సారం కాబోయే ఢీ ఛాంపియ‌న్స్ ఎపిసోడ్‌కు సంబంధించిన నూత‌న ప్రోమో తాజాగా విడుద‌ల అయింది. ప‌లువురు కంటెస్టంట్స్ త‌మ డాన్స్‌ల‌తో అద‌ర‌గొట్టేశారు.

తాజాగా ఎపిసోక‌డ్‌కు సంబంధించిన ప్రోమోలో నేటి స‌మాజంలో జ‌రుగుతున్న విష‌యాల‌ను ఇతివృత్తంగా ఎన్నుకుని డాన్స్‌ల‌తో కంటెస్టంట్స్ దుమ్ములేపిన‌ట్టుగా తెలుస్తోంది. మ‌రీ ముఖ్యంగా మ‌నుషుల మ‌ధ్య ఉన్న అనుబంధాల‌కు అద్దంప‌డుతూ.. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న విష‌యాల‌ను త‌మ డాన్సుల‌తో వివ‌రించే ప్ర‌య‌త్నం చేశారు ప‌లువురు కంటెస్టంట్లు. వీటిల్లో భాగంగా “లైఫ్ ఆఫ్ రామ్ సాంగ్‌”కు ఒక కంటెస్టెంట్‌ చేసిన పెర్ఫామెన్స్‌ ఆకట్టుకుంది.

ఇక మ‌హిళా గొప్ప‌త‌నాన్ని చాటే “మ‌గువా మ‌గువా లోకానికి తెలుసా నీ విలువా” అంటూ సాగే సాంగ్‌కు ఓ బృందం చేసిన డాన్సు అంద‌రిలో ఎమోష‌న‌ల్ ఫీల్ ను క‌లుగజేసింది. దీనికి బాగా క‌నెక్టు అయిన ప్రియ‌మ‌ణి మాట‌లు అంద‌రిని కంట‌నీరు పెట్టించాయి. నేటి స‌మాజంలో మ‌హిళ‌లను చుల‌క‌న భావంతో చూస్తున్నార‌నీ, ఇప్ప‌టికే ప‌లువురు మాట్లాడుతూ..” ఆడ‌వాళ్లు ఎందుకు ప‌నిచేయాలి. పొట్టి దుస్తులు వేసుకుని తిర‌గ‌డం కంటే ఇంట్లోనే ఉంటే వారిపై అఘాయిత్యాలు జ‌ర‌గ‌వుక‌దా? అంటూ చాలా మంది అన్నార‌నీ, ఇప్ప‌టికే ఇలా మ‌హిళ‌ల‌ను కించ‌ప‌ర‌డం” అంటూ ప్రియమణి మాట్లాడుతుండ‌గానే ర‌ష్మీ, వ‌ర్షిణీలు కూడా కన్నీరు పెట్టుకున్నారు. గతంలో తాము ఎదుర్కొన్న ఒడిదుడుకులను గుర్తు చేసుకున్నారు.