టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక హీరో చేయాల్సిన సినిమా మరొకరు చేస్తూ ఉంటారు. ఒక హీరో దగ్గరికి వెళ్లిన కథ మరొక హీరో దగ్గరికి వెళ్లడం అతడు వెంటనే ఓకే చెప్పటం.. సినిమా తీయడం చకచక జరిగిపోతాయి. ఈ రకంగానే ఉదయ్ కిరణ్ దగ్గరకు వెళ్ళిన స్టోరీ మహేష్ బాబు దగ్గరికి వెళ్ళగా వెంటనే.. ఓకే చెప్పి చేసేసారట. ఆ సినిమా మరేదో కాదు “అతడు”. త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన “అతడు”.. సూపర్ విజయం సాధించింది. జైబేరి ప్రొడక్షన్స్ అధినేత మురళీమోహన్.. ఈ సినిమాకి నిర్మాత. ఈ క్రమంలో ఇటీవల ఓ ప్రైవేట్ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొత్త విషయాన్ని తెలియజేశారు.
“అతడు” సినిమా ప్రారంభంలో ఉదయ్ కిరణ్ తో చేయాలని భావించాం. అంతా ఓకే అయింది అని అనుకున్న టైంలో… మహేష్ బాబు తో చేయాల్సి వచ్చింది.. అని మురళీమోహన్ పేర్కొన్నారు. “చిత్రం” అనే మొదటి సినిమాతోనే ఉదయ్ కిరణ్ అందరినీ ఆకట్టుకున్నాడు. ఆ సమయంలో ఇండస్ట్రీలో చాలామంది పెద్దలు అతని నటన చూసి కచ్చితంగా భవిష్యత్తులో మంచి హీరోగా రాణిస్తారని భావించారు.
ప్రత్యేకంగా చిరంజీవి కూడా ఉదయ్ కిరణ్ ఎదుగుదల పెద్దల దగ్గర వినయం.. చూసి ఫ్యామిలీ మెంబర్ గా.. తీసుకోవాలని కూతురికి ఇచ్చి పెళ్లి చేయాలని భావించారు. కానీ అనుకోకుండా కొన్ని కారణాలవల్ల.. ఆ కార్యక్రమం ఆగిపోయింది. ఆ కార్యక్రమం అవ్వకముందు పెళ్లి అనుకున్న టైములో “అతడు” ఉదయ్ కిరణ్ తో చేయాలని భావించాం. అతనికి స్టోరీ కూడా చెప్పాము ఓకే చెప్పాడు. అయితే అనుకోని కారణాలవల్ల ఇక మహేష్ బాబుతో చేయాల్సి వచ్చింది.. అంటూ మురళీమోహన్ తనదైన శైలిలో కొత్త విషయాన్ని బయటపెట్టారు.
విభిన్నమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్.. త్వరలోనే `కార్తికేయ 2`తో పలకరించబోతున్నాడు.…
బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ నేత నితీష్ కుమార్ 8వ సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటి వరకూ నితీష్ కుమార్ ఏడు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం…
గత కొద్ది నెలల నుండి సినిమాల ద్వారా వచ్చే ఆదాయం బాగా తగ్గిపోవడం, నిర్మాణ వ్యయం మోయలేని భారంగా మారడంతో.. తెలుగు సినీ నిర్మాతలు తమ సమస్యలను…
జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మిత్రపక్షమైన బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చారు. ఎన్డీఏ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన నితీష్ కుమార్ ఇప్పటి వరకు…
యంగ్ బ్యూటీ కృతి శెట్టి గురించి పరిచయాలు అవసరం లేదు. తక్కువ సమయంలోనే టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్‌గా మారిన ఈ ముద్దుగుమ్మ.. త్వరలోనే `మాచర్ల నియోజవర్గం`తో ప్రేక్షకులను…
సౌత్‌లో లేడీ సూపర్ స్టార్‌గా గుర్తింపు పొందిన నయనతార ఇటీవలె కోలీవుడ్ దర్శక,నిర్మాత విఘ్నేష్ శివన్‌ను పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. దాదాపు ఆరేళ్ల…