Anita Hassanandini : నువ్వు నేను, శ్రీరామ్, నేనున్నాను వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి అందరినీ మెప్పించిన హీరోయిన్ అనిత, రోహిత్ రెడ్డి దంపతులకు ఫిబ్రవరి 9న పండంటి బాబు పుట్టిన సంగతి మనకు తెలిసిందే. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ ఎంతో సంబర పడిపోయిన ఈ జంట తరువాత కొన్ని రోజులకు తన కుమారుడి ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ అభిమానులతో పంచుకున్నారు. అనిత, రోహిత్ రెడ్డిలు తమ ముద్దుల బాబుకు ఆరవ్ రెడ్డి అనే పేరును కూడా పెట్టారు.
హీరోయిన్ అనిత అప్పుడప్పుడు తన కొడుకుతో ఆడుకుంటూ, ఆడిస్తూ ఉన్న వీడియోలను, ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ ఉంటారు. ఈ సందర్భంగా తాజాగా అనిత తన కొడుకును ఆడిస్తూ ఉన్నటువంటి ఒక వీడియో సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియోలో అనిత బుజ్జి బుజ్జి మాటలతో తన కొడుకును ఆడిస్తూ ఉండటం అందరినీ ఆకట్టుకుంది. 2013లో ఒక్కటైన ఈ జంటకు ఇన్ని సంవత్సరాల పిల్లలు పుట్టడంతో వీరి ఆనందానికి అవధులు లేవు అని చెప్పవచ్చు.
బుల్లితెరపై తన హవా సాగిస్తున్న అనిత..
నువ్వు నేను సినిమాలో ఉదయ్ కిరణ్ సరసన జత కట్టిన అనిత ఈ సినిమా 2001 లో విడుదల అయ్యి బాక్సాఫీస్ బద్దలు కొట్టింది. ఈ సినిమాతో అనిత స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఈ సినిమా విడుదల తర్వాత ఎన్నో అవకాశాలు వచ్చినప్పటికీ మంచి విజయాన్ని పొందలేకపోయింది. తరువాత ఎన్ని సినిమాల్లో నటించిన సరైన గుర్తింపు రాకపోవడంతో, బాలీవుడ్ ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది. హిందీలో పలు చిత్రాల్లో నటించిన అనిత ప్రస్తుతం బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చి పలు సీరియల్స్ లో నటిస్తూ తన హవా కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం అనిత పలు తెలుగు, హిందీ సీరియల్స్ లో ఎంతో బిజీగా గడుపుతున్నారు.