హీరో నితిన్ గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. బేసిగ్గా నిర్మాత కొడుకు అయినప్పటికీ నటుడిగా ఎదగడానికి నితిన్ కి చాలా కాలమే పట్టింది. ఓ సమయంలో నితిన్ వరుస ప్లాపులు ఇస్తూ కెరీర్ ని ఇరకాటంలో పెట్టుకున్నాడు. అదేసమయంలో ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే సినిమాలు పడటంతో మళ్ళీ నితిన్ కెరీర్ ఊపందుకుంది. ఇకపోతే నితిన్ తాజాగా నటిస్తున్న సినిమా మాచెర్ల నియోజక వర్గం. ఈ మూవీ ద్వారా ఎడిటర్ ఎం.ఎస్. రాజశేఖర రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కృతిశెట్టి కేథరిన్ హీరోయిన్ లుగా నటిస్తున్నారు.
తాజా సినిమాకి ఇద్దరు నిర్మాతలు!
శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై N సుధాకర్ రెడ్డి, నిఖితారెడ్డి మూకుమ్మడిగా ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. సినిమా రిలీజుకి దగ్గర పడటంతో ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాలను షురూ చేసింది. తాజాగా ఫస్ట్ ఎటాక్ పేరుతో టీజర్‌ని విడుదల చేసి సినిమాపై హైప్ ని క్రియేట్ చేసింది. ఈ మూవీలో నితిన్ పవర్ ఫుల్ పాత్రలో కలెక్టర్ గా నటిస్తున్నాడు. అంతే కాకుండా ఈ పాత్ర కోసం సరికొత్త మేకోవర్ తో లైట్ గడ్డం.. మెలితిప్పిన మీసం కట్టుతో మ్యాన్లీగా పవర్ ఫుల్ లుక్ లోకి మారపోయాడు.
నితిన్ హీరో ఇలా అయ్యాడు!
ఇకపోతే, ఈ కార్యక్రమంలో పాల్గొన్న దిల్ రాజు మాట్లాడుతూ.. హీరో నితిన్ హీరో ఎలా అయ్యాడో సీక్రెట్ బయటపెట్టాడు. “నితిన్ హీరో అయి 20 ఏళ్లవుతోంది. నేను నిర్మాతగా మారి కూడా దాదాపుగా 20 ఏళ్లు కావస్తోంది. 19 ఏళ్లు పూర్తయి 20 ఏళ్లలోకి అడుగుపెట్టాం. దీని వెనక పెద్ద కధే వుంది. నితిన్ వాళ్లు ఫాదర్ నేను వ్యాపార భాగస్వాములం. ఇద్దరం కలిసి పవన్ కల్యాణ్ సినిమా `తొలిప్రేమ`ని నైజాంలో రిలీజ్ చేశాం. ఆ సమయంలో నేను డైలీ థియేటర్ కు వెళ్లి సినిమాలు చూస్తుండే వాడిని.. నితిన్ అప్పుడు కాలేజీ స్టూడెంట్. కాలేజీకి డుమ్మాకొట్టి సినిమాలు చూస్తుండేవాడు. అలా సినిమాపై నితిన్ కు ఓ పాషన్ ఏర్పడింది. ఓరోజు నాకే అనిపించింది.. మనోడిని నేనే తెరకి పరిచయం చేయాలని.. అలా నితిన్ జర్నీ జరిగింది.” అని చెప్పుకొచ్చాడు.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!