మాట నిల‌బెట్టుకున్న దిల్‌రాజు


క‌థ బావుంటే సినిమాలు చేయ‌డానికి ఆస‌క్తి చూపించే నిర్మాత‌ల్లో దిల్‌రాజు ఒక‌రు. ఓ సంద‌ర్భంలో ఆయ‌న మాట్లాడుతూ కొత్త క‌థ‌ల‌ను ఎన్నింటినో తాను వెండితెర‌పై తీసుకు రావాల‌నుకుంటున్నాన‌ని, ఎవ‌రైనా నిర్మాత‌లు మంచి క‌థ‌ల‌తో త‌న ద‌గ్గ‌ర‌కు వ‌స్తే తాను సినిమా చేయ‌డానికి సిద్ధ‌మేన‌ని,నిర్మాణంలో తాను వారికి పూర్తి స‌హకారం అందిస్తాన‌ని కూడా తెలిపారు. చెప్పిన‌ట్లే ఆయ‌న మాట‌పై నిల‌బ‌డ్డారు. ఇప్పుడు దిల్‌రాజు, డైరెక్ట‌ర్ క్రిష్ క‌లిసి ఓ సినిమాను నిర్మించ‌నున్నారు. అవ‌స‌రాల శ్రీనివాస్ హీరోగా, రుహానీ శ‌ర్మ హీరోయిన్‌గా ఓ సినిమా రూపొంద‌నుంది. `నూటొక్క జిల్లాల అంద‌గాడు` పేరుతో తెర‌కెక్క‌బోతుంది. రామ్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్న ఈ చిత్రానికి స్వీకార్ అగ‌స్తి సంగీతాన్ని అందిస్తున్నారు.