Dil Raju: అవునట.. సినిమా నిర్మాత దిల్ రాజు ఆ రహస్యాన్ని చెప్పేసారు. మనలో అనేకమందికి ఈ మధ్య రిలీజైన సినిమాల విషయంలో పలు అనుమానాలు వున్నాయి కదా. సినిమా చూస్తే ఏదోలాగ అనిపిస్తుంది. ఇక దాని కలెక్షన్లు చూసే మాత్రం, మనం సినిమా పడుకొని చూశామా? అనే అనుమానం రేకెత్తుతుంది. ఎందుకంటే, సదరు సినిమాలకు వచ్చిన కలెక్షన్లు ఆకాశాన్నంటుతున్నాయి. తాజాగా రిలీజైన ఓ బడా స్టార్ హీరో సినిమానే దీనికి ఓ పచ్చి ఉదాహరణ. సినిమా రిలీజు అయిన మొదటి రోజు, మొదటి అతనుండే డివైడ్ టాక్ నడించింది. తీరా కలెక్షన్లు చూస్తే మాత్రం బారెడున్నాయి.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
గుట్టు చెప్పేసిన దిల్:
ఏ సినిమా హిట్టో ఏ సినిమా ఫ్లాపో తెలియని అయోమయంలో పడిన తెలుగు ప్రేక్షకులకు ఓ క్లారిటీ ఇచ్చేసాడు నిర్మాత దిల్ రాజు. అవును… ఓ మీడియా ఇంటర్వ్యూల్లో దీని గురించి ఆయన స్పందిస్తూ ఇలా అన్నారు. డిస్ట్రిబ్యూటర్లుగా వారు నిర్మాతలకు నిజమైన కలెక్షన్ల రిపోర్టే పంపిస్తామని.. ఐతే వసూళ్లను ప్రకటించడం అనేది వాళ్ల వ్యక్తిగతం అని చెప్పుకొచ్చాడు. సో దీని వలన మనకి అర్ధం అయినది ఏమంటే, సినిమా ప్లాప్ అయినా, సదరు నిర్మాత ఎక్కువ కలెక్షన్లు చూపించి ప్రేక్షకులను మభ్య పెడుతున్నాడని అర్ధం కదా.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
దిల్ మరోమాట కూడా చెప్పాడు:
తెలుగు పరిశ్రమలో త్వరలో కలెక్షన్ల ట్రాకింగ్ సిస్టమ్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని కూడా ఆయన ఈ సందర్భంగా చెప్పాడు. ఇక US లాంటి చోట్ల ఇలాంటి ట్రాకింగ్ సిస్టం వల్ల కలెక్షన్ల వివరాలు పక్కాగా ఉంటాయట. ఇక్కడ మల్లే అక్కడ ప్రేక్షకుడిని మాయం చెయ్యరట. కానీ టాలీవుడ్లో ఇలాంటి ఒక పద్ధతి లేకపోవడం వల్ల ఎవరిష్టం వచ్చినట్లు కలెక్షన్లు వేసుకోవడం ప్రేక్షకులను తప్పుదోవ పట్టిస్తున్నారు అని కొంతమంది మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో దిల్ రాజు మాటల్ని బట్టి చూస్తే ఈ కలెక్షన్ల కోతలకు త్వరలోనే తెరపడే అవకాశం కనిపిస్తోందని అర్ధం అవుతోంది.