Pooja Hegde: అనిల్ రావిపూడి దర్శకత్వ ప్రతిభ తెలియంది కాదు. హాస్యంతో పాటు గ్లామర్ కంటెంట్ ని రంగరించి చెప్పడం ఇతనికే చెల్లింది. ఈ క్రమంలో వచ్చిందే F2 సినిమా. ఈ సినిమా ఎలాంటి ప్రభంజనాలు సృష్టించిందో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఇతడు F2కి కొనసాగింపు భాగం ఎఫ్ 3ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీలో తమన్నా – మెహ్రీన్ ల గ్లామర్ కంటెంట్ మరో లెవల్లో ఉంటుందని టాక్ వినిపిస్తోంది. ఇంతకుముందు రిలీజ్ చేసిన ఎఫ్ 3 లోని ఊ ఆ అహా అహా అనే పాట చూశాక ఈ సినిమాకు గ్లామర్ డబుల్ డోస్ యాడ్ చేశారని అర్థమవుతోంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
Pooja Hegde: దిల్ రాజు స్కెచ్ ఇదే:
ఇక ఈ సినిమాలో సోనాల్ బికినీలతో రెచ్చిపోనుందని టాక్ వినిపిస్తోంది. అయితే ఇంతలోనే బుట్టబొమ్మ పూజా హెగ్డేతో ఐటమ్ నంబర్ చేయించే ఆలోచనతో నిర్మాత దిల్ రాజు ఉన్నారన్న టాక్ బయట బాగా వినిపిస్తోంది. అయితే దీనివెనుక దిల్ రాజు స్కెచ్ భారీగానే ఉందని తెలుస్తోంది. నిజానికి దిల్ రాజు ఇంతకుముందే ఒక సినిమా కోసం పూజా హెగ్డేకి అడ్వాన్స్ ఇచ్చి వున్నారని టాక్ వినబడుతోంది. అయితే పూజా హెగ్డే ఒక్కో చిత్రానికి రూ. 4 కోట్లు పారితోషికం తీసుకుంటోంది. ఆ కారణంగా పూజా పై దిల్ రాజు ఆసక్తిగా లేరట.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
అసలు విషయం ఇదే:
పూజ డిమాండ్ ని చుసిన దిల్ రాజు, ఆమెకి అడ్వాన్స్ తిరిగి వెనక్కి అడగడం కంటే ఒక ఐటెమ్ సాంగ్ ని చేయడం బెటర్ అని తలచి ఈ ఆలోచన చేసాడని టాక్. ఇక గ్లామర్ డోస్ ఎంత పెంచినా ఆస్వాధించేందుకు యూత్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది కనుక పూజ ఐటెం సాంగ్ స్టెప్పులుని డిజైన్ చేశారట చిత్ర యూనిట్. విక్టరీ వెంకటేష్ – వరుణ్ తేజ్ – సునీల్ లతో కలిసి అనీల్ రావిపూడి ఈసారి భారీ ఎంటర్ టైనర్ ని తెరకెక్కిస్తున్నారు. టాలీవుడ్ లో మరో గోల్ మాల్ రేంజులో ఇది ఉంటుందని భావిస్తున్నారు. ఈ వేసవిలో విడుదలయ్యే F3 – ఫన్ రైడ్ ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి మరి.