Dil Raju : ఫామ్ లోకి వచ్చిన దిల్ రాజు.. వరుసగా ఆ హీరోలతో..?

Dil Raju who came into the form .. with those heroes in a row ..?
Share

Dil Raju: తెలుగు ఇండస్ట్రీలో అగ్ర నిర్మాతలలో ఒకరిగా దిల్ రాజు ఎంతో పేరు ప్రఖ్యాతులను సంపాదించుకున్నారు. ఇప్పటికే ఇండస్ట్రీలో ఎంతో పేరు మోసిన నిర్మాతలు అల్లు అరవింద్, సురేష్ ప్రొడక్షన్స్ ఉండగా ఈ నిర్మాణ సంస్థలు ఏదైనా భారీ బడ్జెట్ చిత్రాన్ని తెరకెక్కించాలంటే కొంత సమయం తీసుకుంటారు. కానీ దిల్ రాజు విషయంలో అలా ఉండదు. ఒకవైపు చిన్న సినిమాలను నిర్మిస్తూనే మరోవైపు పెద్ద సినిమాలను కూడా నిర్మిస్తుంటారు. కానీ ఈ మధ్య కాలంలో దిల్ రాజు కేవలం చిన్న సినిమాలను మాత్రమే నిర్మిస్తున్నారు. కానీ ప్రస్తుతం దిల్ రాజు చిన్న సినిమాలతో పాటు భారీ చిత్రాలను నిర్మించడానికి సిద్ధమయ్యారు.

Dil Raju who came into the form .. with those heroes in a row ..?
Dil Raju who came into the form .. with those heroes in a row ..?

వరుసగా భారీ సినిమాలను నిర్మించడమే కాకుండా ఆ చిత్రాలను పాన్ ఇండియా తరహాలో తెరకెక్కించడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు ఈ నిర్మాత. ఈ క్రమంలోనే దిల్ రాజు బ్యానర్ లో భారీ సినిమాలను తీసుకువస్తున్నారు. తాజాగా మెగా హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ సినిమా వకీల్ సాబ్ సినిమాను దిల్ రాజు నిర్మించారు. ఈ సినిమా ఏప్రిల్ 9న విడుదల కానుంది. అదేవిధంగా రామ్ చరణ్ తేజ్-శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాను దిల్ రాజు పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి దాదాపు 130 కోట్ల బడ్జెట్ కేటాయించనున్నట్లు సమాచారం.

సలార్ కాంబినేషన్ లో దిల్ రాజు సినిమా:
ఇకపోతే పాన్ ఇండియా హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్న ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఓ చిత్రాన్ని చేయాలనే ఆలోచనలో దిల్ రాజు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో సలార్ సినిమాను పాన్ ఇండియా తరహాలో తెరకెక్కిస్తున్నారు.ఇవే కాకుండా మరో రెండు పాన్ ఇండియా చిత్రాలను నిర్మించడం కోసం దిల్ రాజు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే అల్లుఅర్జున్ తో మరో సినిమా చేయాలనే ఆలోచన చేస్తున్నారు.ఇప్పటికే అల్లు అర్జున్ హీరోగా దిల్ రాజు బ్యానర్ లో ఆర్య, పరుగు, డీజే వంటి సినిమాలు తెరకెక్కాయి. ప్రస్తుతం అల్లు అర్జున్ తో దిల్ రాజు నాలుగో సినిమా నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ఒకేసారి దిల్ రాజు భారీ బడ్జెట్ తో ఇన్ని పాన్ ఇండియా చిత్రాలను నిర్మించడం అంటే చిన్న విషయం కాదు.కానీ ఈ విధమైన భారీ చిత్రాలను నిర్మించడం కేవలం దిల్ రాజ్ కు మాత్రమే సాధ్యమవుతుందని చెప్పవచ్చు.


Share

Related posts

బిగ్ బాస్ 4 : అభిజీత్ మీద పిచ్చకోపంగా ఉన్న హారిక ఫ్యామిలీ ??

sekhar

Divi Vadthya Bigg Boss Season4 Contestants Photos

Gallery Desk

చిరంజీవే అక్షరబద్ధం చేస్తున్న స్వీయ చరిత్ర.. అతి త్వరలో

Muraliak