దిల్‌రాజుతో బాల‌య్య సినిమా క‌న్‌ఫ‌ర్మేనా?

Share


న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ 105వ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానేలేదు. అంత‌లోప‌లే..ఆయ‌న చేయ‌బోయే మ‌రో సినిమాకు సంబంధించిన ప‌నులు ప్రారంభ‌మ‌య్యాయ‌ని సినీ వ‌ర్గాల స‌మాచారం. వివ‌రాల ప్ర‌కారం హిందీలో విజ‌య‌వంత‌మైన `పింక్‌` చిత్రాన్ని త‌మిళంలో అజిత్ హీరోగా `నెర్కొండ పార్వై` అనే పేరుతో రీమేక్ చేశారు బోనీక‌పూర్‌. అప్ప‌ట్లో టాలీవుడ్‌లో రీమేక్ చేయాల‌ని ప్ర‌య‌త్నించినా వీలుకాలేదు. తాజాగా ఇప్పుడు దిల్‌రాజు పింక్ రీమేక్‌ను బాల‌కృష్ణ‌తో చేయాల‌నుకుంటున్నాడ‌ట‌. అందుక‌నే అజిత్ సినిమా త‌మిళ సినిమా తెలుగు డ‌బ్బింగ్ వెర్ష‌న్‌ను తెలుగులో విడుద‌ల చేయ‌డం లేద‌ట‌. తెలుగులో ఈ చిత్రం చేయ‌డానికి బాల‌కృష్ణ కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు స‌మాచారం. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు ప్రారంభ‌మయ్యాయ‌ని, ఈ చిత్రానికి `లాయ‌ర్‌సాబ్‌` అనే పేరు పరిశీల‌న‌లో ఉన్న‌ట్లు టాక్‌.


Share

Related posts

sai dharam tej : సాయి ధరం తేజ్ లేటెస్ట్ మూవీ కి ‘రిపబ్లిక్’ అన్న టైటిల్ ఫిక్స్ ..!

GRK

పూరి జగన్నాధ్ డ్రీం ప్రాజెక్ట్ లో హీరో ఆయనే..?

GRK

Acharya : ‘ఆచార్య’: ఇలా అయితే కథ లీకైపోతుంది కదా ..?

GRK

Leave a Comment