Dimple Hayathi: తెలుగమ్మాయి అయిన డింపుల్ హయాతి గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `గల్ఫ్` అనే మూవీతో సినీ కెరీర్‌ను ప్రారంభించిన ఈ భామ.. ఆ తర్వాత యురేక, అభినేత్రి 2 చిత్రాల్లో నటించింది. కానీ, అవేమి ఆమెకు క్రేజ్ తెచ్చి పెట్టలేకపోయాయి. అప్పుడు డింపుల్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన `గద్దలకొండ గణేష్` సినిమా జర్రా జర్రా అనే ఐటెం సాంగ్ చేసి యూత్‌ను ఓ ఊపు ఊపేందుకు.
సినిమాలతో రాని గుర్తింపు ఈ ఒక్క పాటతో దక్కించుకున్న డింపుల్ హయాతి.. ఇకపై ఐటెం సాంగ్స్ చేయకూడదని, హీరోయిన్‌గానే సత్తా చాటాలని భావించింది. ఆమె కోరుకున్నట్లే సినిమాల్లో హీరోయిన్‌గా అవకాశాలు వచ్చాయి. ఇటీవలె ఆమె విశాల్‌తో `సామాన్యుడు`, మాస్ మహారాజ్ రవితేజలతో `ఖిలాడి` చిత్రాలు చేసింది.
కానీ, ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. ఖిలాడి భామను పట్టించుకునే వారే లేరు. ఈ రెండు సినిమాల తర్వాత డింపుల్ మరో కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించలేదు. అయితే ఆఫర్ల లేకపోవడంతో డింపుల్ మళ్లీ ఐటెం సాంగ్స్ చేసేందుకు సిద్ధమైందట. ఇందులో భాగంగా నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న `ఎన్‌బీకే 107`లో స్పెషల్ సాంగ్ చేసేందుకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చింది.
ప్రస్తుతం బాలయ్య, డింపుల్ లపై ఆ స్పెషల్ సాంగ్ ను చిత్రీకరిస్తున్నారని.. దీనికి శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందిస్తున్నారని అంటున్నారు. హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో నిర్మించిన సెట్ లో ఈ పాట చిత్రీకరణ జరుగుతోంది. అంతేకాదు, సినిమాకి ఈ పాట హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. మరి ఇది ఎంత వరకు నిజమో తెలియాల్సి ఉంది. కాగా, మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలయ్యకు జోడీగా శ్రుతి హాసన్ నటిస్తోంది. తమన్ స్వరాలు సమకూర్చుతున్నారు.
Virata Parvam-Vikram: కరోనా వచ్చిన తర్వాత ఓటీటీల హవా ఏ స్థాయిలో పెరిగిందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. ప్రస్తుతం థియేటర్స్‌లో…
Mango: వేసవి కాలం వచ్చిందంటే చాలు మామిడి పండ్ల సీజన్ మొదలైనట్టే.. ఈ సీజన్ లో దొరికే మామిడి పండ్ల…
Hero Ram: టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని పెళ్లి పీటలెక్కబోతున్నాడంటూ గత కొద్ది రోజుల నుంచీ నెట్టింట జోరుగా…
AP Employees: ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో సొమ్ములు మాయం అయిన ఘటనపై ఏపి ఉద్యోగ సంఘాల నేతలు బొప్పరాజు వెంకటేశ్వరరావు తదితరులు…
Rice Idly: హెల్తీ బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీ కూడా ఒకటి.. ఆరోగ్యానికి మంచిదనీ తెలిసినా ఈ పిండి సిద్ధం…
Bihar Politics: నలుగురు బీహారీ ముస్లిం నేతలు ఎంఐఎం అధినేత ఒవైసీకి బిగ్ షాక్ ఇచ్చారు. గత ఎన్నికల్లో గెలిచిన…