Chiranjeevi 154: మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న కుర్ర హీరోల అందరి కంటే వరుసపెట్టి సినిమాలను లైన్ లో పెట్టారు. మహమ్మారి కరోనా వైరస్ రాకముందు ఆచార్య షూటింగ్ ప్రభుత్వాలు చెప్పకపోయినా ముందే ఆపేశారు. ఇండస్ట్రీ పట్ల బాధ్యతగా వ్యవహరిస్తూ దాదాపు రెండు సంవత్సరాల కాలంలో అనేక కార్యక్రమాలు చేసిన చిరంజీవి.. సినిమా టికెట్ ధర విషయంలో కీలకపాత్ర పోషించి రెండు ప్రభుత్వాలతో మాట్లాడి.. సమస్యకి సామరస్య వాతావరణంలో పరిష్కారం చూపారు.
ఇదిలా ఉంటే ఫస్ట్ టైం చరణ్ తో “ఆచార్య” లో లాంగ్ లెన్త్ సినిమా చేసిన చిరంజీవి.. ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయారు. గత నెల ఏప్రిల్ 29వ తారీకు విడుదలైన “ఆచార్య” బాక్సాఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్ అయ్యింది. డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన గాని సినిమా పరాజయం పాలు కావడంతో.. మెగా ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు లూసిఫర్ సినిమా రీమేక్ చేస్తూనే మరో పక్క డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో చిరంజీవి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చిరంజీవి అదిరిపోయే పవర్ ఫుల్ మాస్ పాత్ర చేస్తున్నట్లు సినిమా పోస్టర్ బట్టి టాక్ బయట వినబడుతోంది.
అయితే ఈ టైటిల్ విషయంలో ఇప్పటివరకు క్లారిటీ లేదు. కానీ ఆచార్య సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో చిరంజీవి “వాల్తేర్ వీరయ్య” అనే టైటిల్ పేరు చెప్పడం జరిగింది. కానీ అది కన్ఫార్మ..? కాదా..? అన్నది చాలా మందిలో సస్పెన్స్ కి దారి తీసింది. అయితే తాజాగా డైరెక్టర్ బాబి “వాల్తేరు వీరయ్య” అనేది టైటిల్ నీ కన్ఫర్మ్ చేసేసారు. ఈ విషయాన్ని అధికారికంగా కూడా చెప్పేశారు. ఇటీవల విజయవాడలో మెగా ఫ్యాన్స్ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన బాబి ఈ విషయాన్ని తెలపటంతో ఫ్యాన్స్ అద్దిరిపోయింది టైటిల్ అని పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.
Virata Parvam-Vikram: కరోనా వచ్చిన తర్వాత ఓటీటీల హవా ఏ స్థాయిలో పెరిగిందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. ప్రస్తుతం థియేటర్స్లో…
Mango: వేసవి కాలం వచ్చిందంటే చాలు మామిడి పండ్ల సీజన్ మొదలైనట్టే.. ఈ సీజన్ లో దొరికే మామిడి పండ్ల…
Hero Ram: టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని పెళ్లి పీటలెక్కబోతున్నాడంటూ గత కొద్ది రోజుల నుంచీ నెట్టింట జోరుగా…
AP Employees: ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో సొమ్ములు మాయం అయిన ఘటనపై ఏపి ఉద్యోగ సంఘాల నేతలు బొప్పరాజు వెంకటేశ్వరరావు తదితరులు…
Rice Idly: హెల్తీ బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీ కూడా ఒకటి.. ఆరోగ్యానికి మంచిదనీ తెలిసినా ఈ పిండి సిద్ధం…
Bihar Politics: నలుగురు బీహారీ ముస్లిం నేతలు ఎంఐఎం అధినేత ఒవైసీకి బిగ్ షాక్ ఇచ్చారు. గత ఎన్నికల్లో గెలిచిన…