30.2 C
Hyderabad
December 6, 2022
NewOrbit
Entertainment News సినిమా

Waltair Veerayya: చిరంజీవి, పవన్ లపై డైరెక్టర్ బాబీ సంచలన కామెంట్స్..!!

Share

Waltair Veerayya: బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి “వాల్తేరు వీరయ్య” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి కానుకగా జనవరి నెలలో ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాలో చిరంజీవి సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. మాస్ మహారాజ రవితేజ కీలకపాత్రలో కనిపిస్తున్నారు. చాలాకాలం తర్వాత చిరంజీవితో రవితేజ ఒక ఫుల్ లెన్త్ రోల్ లో నటిస్తూ ఉండటంతో ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఈ సినిమా పూర్తి మాస్ ఎలిమెంట్స్ తో తీసినట్లు విడుదలైన వీడియో మరియు ఫోటోలు బట్టి తెలుస్తోంది. ఇదిలా ఉంటే మరి కొద్ది గంటల్లో ఈరోజు సాయంత్రం “వాల్తేరు వీరయ్య” ఫస్ట్ సింగిల్ “బాస్ పార్టీ” సాంగ్ రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ బాణీలు సమకూర్చారు.

Director Bobby sensational comments on Chiranjeevi and Pawan
Waltair Veerayya:

నిన్న ఈ సాంగ్ ప్రోమో రిలీజ్ చేయడం జరిగింది. కాగా తాజాగా ఈ సాంగ్ నీ పవన్ కళ్యాణ్ చూసినట్లు ట్విట్టర్ ద్వారా డైరెక్టర్ బాబీ తెలియజేశారు. ఈ క్రమంలో ఈ ఫస్ట్ సింగిల్ సాంగ్ ని చిరంజీవి పవన్ కళ్యాణ్ తో కలిసి చూడటం ఆనందంగా ఉందని బాబి ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ..”నాకు అత్యంత ఇష్టమైన ఇద్దరు వ్యక్తులు మెగాస్టార్, పవర్ స్టార్ నా పక్కన ఉన్నారు. పవన్ “బాస్ పార్టీ” పాట చూసి ఎంతగానో ఇష్టపడ్డారు అని చెప్పుకొచ్చారు. దీంతో డైరెక్టర్ బాబీ పెట్టిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Director Bobby sensational comments on Chiranjeevi and Pawan
Waltair Veerayya:

ఫోటోలు కూడా పోస్ట్ చేయడంతో అభిమానులు… రకరకాల కామెంట్లు పెడుతున్నారు. ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ హీరోగా డైరెక్టర్ బాబీ… “సర్దార్ గబ్బర్ సింగ్” సినిమా చేయడం జరిగింది. అప్పట్లో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా అసలు ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. దీంతో “వాల్తేరు వీరయ్య” సినిమా విషయంలో అభిమానులు కొద్దిగా టెన్షన్ పడుతున్నారు.


Share

Related posts

Prabhas, NTR: ప్రభాస్, ఎన్టీఆర్ చేతులు కలిపితే మాములుగా ఉండదు.. చూడండి మీరే..

Ram

Pushpa: “పుష్ప” కలెక్షన్స్ పై కరణ్ జోహార్ సంచలన కామెంట్స్..!!

sekhar

`జైలర్`గా డ్యూటీ ఎక్కిన రజనీకాంత్.. ఖైదీల తాట తీయ‌డం ఖాయం!

kavya N