Waltair Veerayya: మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా “వాల్తేరు వీరయ్య” జనవరి 13వ తారీకు విడుదల కానుంది. సంక్రాంతి పండుగ కానుకగా వస్తున్న ఈ సినిమాకి సంబంధించి డైరెక్టర్ బాబీ సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా మొత్తానికి చిరంజీవి హైలెట్ అని అన్నారు. ఆయన కనిపించని సన్నివేశాలలో సైతం… రోమాలు నెక్కబొడుచుకునేలా పాత్ర తీరు ఉంటుందని పేర్కొన్నారు. మూవీ సినిమా మొత్తం చూడటం జరిగింది. గ్యారెంటీ ఇస్తున్నాను ఇది పక్కా హిట్. “వాల్తేరు వీరయ్య” విడుదల చేయడానికి అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నాము.
సినిమా స్టార్ట్ అయిన నాటినుండి వీరయ్య కనిపించే ప్రతి సన్నివేశం ప్రేక్షకులు ఈలలు వేసేలా ఉంటుంది అని తెలిపారు. దీంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. పైగా ఈ సినిమాలో రవితేజ కీలక పాత్రలో కనిపిస్తూ ఉండటంతో మెగా ఫాన్స్.. రవితేజ చిరు సన్నివేశాలు ఏ రీతిగా ఉంటాయో అని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల రవితేజ పాత్రకి సంబంధించి విడుదలైన వీడియో చాలా పవర్ ఫుల్ గా ఉంది. ఇంకా ఇదే సమయంలో.. విడుదలైన రెండు పాటలు కూడా సంగీత ప్రేక్షకులను ఎంతగానో అల్లరిస్తున్నాయి. దేవి శ్రీ ప్రసాద్ ఇచ్చిన మాస్ బిట్స్.. ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా “బాస్ వస్తున్నాడు” అనే సాంగ్ యూట్యూబ్ లో అనేక రికార్డులు క్రియేట్ చేస్తుంది.
సంక్రాంతి బరిలో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద దిగ్గుతున్న ఈ సినిమాకి “వీరసింహారెడ్డి” పోటీ. చాలా సంవత్సరాల తర్వాత బాలకృష్ణ మరియు చిరంజీవి సినిమాలు ఒకేసారి విడుదల అవుతూ ఉండటంతో… ఏది హిట్ ఏది ఫట్ అనే దాని విషయంలో అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. చివరిగా 2017లో సంక్రాంతి పండుగకి ఈ ఇద్దరు హీరోలు పోటి పడ్డారు. బాలకృష్ణ “గౌతమీ పుత్రా శాతకర్ణి”…చిరంజీవి “ఖైదీ నెం 150” ఒకరోజు వ్యవధిలో విడుదల అయ్యాయి. రెండు సినిమాలు బాగా ఆడాయి. మరీ ఈ సారి సంక్రాంతి ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.