మెగాస్టార్ చిరంజీవితో డైరెక్టర్ బాబు సినిమా చేయనున్న సంగతి తెలిసింది. ఈ సినిమా వచ్చే సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు ఇటీవల పోస్టర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో చిరంజీవితో పాటు రవితేజ కూడా పాత్ర చేస్తున్నట్లు ప్రారంభంలో వార్తలు వచ్చాయి. అయితే తాజాగా రవితేజ పాత్రకి సంబంధించి డైరెక్టర్ బాబి మనసు మార్చుకున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి.
విషయంలోకి వెళ్తే చిరంజీవి సినిమాకి రవితేజ ఇచ్చే డేట్లు సరితూగని పరిస్థితి ఉండటం తో పాటు రవితేజ షెడ్యూల్ బిజీగా ఉండటంతో… అతని ప్లేస్ లో మరో హీరోని తీసుకొచ్చే ఆలోచనలో డైరెక్టర్ బాబీ ఉన్నారంట. ఈ సినిమాలో చిరంజీవి సరసన హీరోయిన్ గా శృతిహాసన్ నటించిన. ఇప్పటికే ఆమె షూటింగ్ లో కూడా జాయిన్ కావడం జరిగింది. దీంతో సంక్రాంతికి సినిమా రిలీజ్ అని ముందుగానే ప్రకటించడంతో రవితేజ పాత్రకి సంబంధించి మరో హీరోను వెతికే పనిలో డైరెక్టర్ బాబీ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
కుదిరితే రవితేజ స్థానంలో శ్రీకాంత్ నీ తీసుకునే అవకాశాలు ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. చిరంజీవి నటించిన “గాడ్ ఫాదర్” విజయదశమి నాడు రిలీజ్ కానుంది. ఈ సినిమాకి సంబంధించి ఒక సాంగ్ మన హాస్పిటల్ మొత్తం కంప్లీట్ అయింది. మరోపక్క “బోలా శంకర్” సినిమా షూటింగ్ సగం పూర్తయింది. అయితే తాజాగా స్టార్ట్ అయిన బాబి సినిమా ఈ ఏడాది చివరి లోపు కంప్లీట్ చేయాలని చిరంజీవి స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యారు.