Sai pallavi:సాయి పల్లవి గురించి పరిచయం అక్కర్లేదు. బేసిగ్గా కేరళ కుట్టి అయిన సాయి పల్లవి తెలుగు నాట మంచి పాపులర్ సంపాదించుకుంది. మంచి అందంతో పాటు చక్కని అభినయం ఆమె సొంతం. ఇక ఇప్పుడున్న హీరోయిన్లలో పర్ఫెక్ట్ గా డాన్స్ వేసింది సాయి పల్లవి మాత్రమే. ప్రస్తుతం ఆమెకి హీరోలని తలదన్నే రీతిలో అభిమానులు వున్నారు. ఆమెని ఇక్కడ లేడి పవర్ స్టార్ అని పిలుస్తున్నారు అంటే ఇక అర్ధం చేసుకోండి, ఆమె ఏ రకంగా కీర్తించబడుతుందో. ఇకపోతే తాజాగా సాయి పల్లవి – రానా జంటగా నటించిన ‘విరాటపర్వం’ సినిమా రిలీజైన విషయం తెలిసినదే.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
Sai pallavi: ప్రేమ – పోరాటం మధ్య సంఘర్షణ:
సురేశ్ బాబు – సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా నిన్ననే ప్రేక్షకుల ముందుకు వచ్చి, హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా సాయి పల్లవి నటనకు ప్రక్షకులు బ్రహ్మరథాన్ని పడుతున్నారు. ప్రేమ – పోరాటం అనే రెండు అంశాల మధ్య చోటుచేసుకునే సంఘర్షణని ఈ సినిమాలో దర్శకుడు వేణు ఊడుగుల చక్కగా చూపించాడు. విడుదలైన ప్రతి ప్రాంతంలో తొలి ఆటతోనే సక్సెస్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే కొంతసేపటి క్రితం ఈ సినిమా టీమ్ సక్సెస్ మీట్ ను నిర్వహించింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
Sai pallavi: సాయి పల్లవి లేకుంటే ఈ సినిమా లేదు!
ఈ నేపథ్యంలో వేణు ఊడుగుల మాట్లాడుతూ.. “ఈ సినిమాకి అన్ని ఏరియాల నుంచి వస్తున్న హిట్ టాక్ మమ్మల్ని ఆనందానికి గురి చేస్తోంది. ఈ సందర్భంగా ముఖ్యంగా ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఆమే హీరోయిన్ సాయి పల్లవి. సాయిపల్లవి ఈ కథను ఒప్పుకోవడం మా అదృష్టం. ఆమె అంగీకరించకపోతే నేను ఈ సినిమాను తీసేవాడినే కాదు. ఆమే లేకుంటే ఈ సినిమానే లేదు. ఇలాంటి మంచి సినిమాలను మరింతగా జనంలోకి తీసుకుని వెళ్లవలసిందిగా మీడియా మిత్రులను కోరుతున్నాను” అంటూ చెప్పుకొచ్చారు.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!