Gopichand Malineni: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో టాప్ మోస్ట్ దర్శకులలో గోపీచంద్ మలినేని ఒకరు. తనదైన యాక్షన్ ఎంటర్టైన్మెంట్ టచ్ తో అద్భుతమైన సినిమాలు చేస్తూ వరుస పెట్టి విజయాలు సాధిస్తూ ఉన్నారు. మాస్ మహారాజ రవితేజతో బ్యాక్ టు బ్యాక్ విజయాలు అందుకుని హ్యాట్రిక్ కూడా అందుకోవటం జరిగింది. రీసెంట్ గా నందమూరి బాలకృష్ణ తో “వీరసింహారెడ్డి” చేసి బ్లాక్ బస్టర్ విజయం తన ఖాతాలో వేసుకోవడం జరిగింది. సంక్రాంతి పండుగకు వచ్చిన ఈ సినిమా అత్యధికమైన వసూలు సాధించి బాలయ్య కెరియర్ లోనే హైయెస్ట్ కలెక్షన్ సాధించి రికార్డు క్రియేట్ చేసింది.
ఇదిలా ఉంటే ఇప్పుడు తమిళ్ లో బిగ్ స్టార్ హీరోతో బంపర్ ఆఫర్ గోపీచంద్ మలినేని అందుకున్నట్లు సమాచారం. పూర్తి విషయంలోకి వెళ్తే తమిళ స్టార్ హీరో దళపతి విజయ్.. ఇటీవల గోపీచంద్ మలినేని చెప్పిన స్టోరీ విన్నట్లు బాగా ఇంప్రెస్ అయినట్లు టాక్. కలిసి పనిచేయాలని సిద్ధమైనట్లు త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాని తెలుగు మరియు తమిళ్ భాషల్లో.. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనుందట. కొద్దిరోజుల క్రితం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ సినిమా చేయడం జరిగింది. “వారసుడు” టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమాని దిల్ రాజు నిర్మించారు. తెలుగు మరియు తమిళ్ లో విడుదలైన ఈ సినిమా భారీ విజయం సాధించింది.
విజయ్ కెరియర్ లో అద్భుతమైన విజయాన్ని అందుకోవటం జరిగింది. కోలీవుడ్ ఇండస్ట్రీలో అనేకమైన రికార్డులు క్రియేట్ చేయడం జరిగింది. దీంతో తెలుగు దర్శకుల పనితీరు నచ్చిన విజయ్ ఇప్పుడు… గోపీచంద్ మలినేని సినిమాకి పచ్చజెండా ఊపినట్లు ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమా దర్శకులకు మంచి డిమాండ్ ఉంది. RRR, బాహుబలి, పుష్ప సినిమాలు ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటాయి. RRR ఏకంగా ఆస్కార్ అవార్డు గెలవడం తెలిసిందే. దీంతో తెలుగు దర్శకులతో పనిచేయడానికి దేశవ్యాప్తంగా ఉన్న ఇతర ఇండస్ట్రీకి చెందిన హీరోలు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు.