Surya: తమిళ హీరో సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎటువంటి పాత్రలైనా చేసే సత్తా గలిగిన మోస్ట్ టాలెంటెడ్ హీరో. ఎప్పుడు ఒకేలా సినిమాలు చేయకుండా ప్రయోగాత్మక సినిమాలు చేస్తూ వైవిద్యభారతమైన నటనతో… ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ ఉంటాడు. దక్షిణాదిలో తిరుగులేని క్రేజ్ సూర్యకి ఉంది. తమిళంలో ఏ రీతిగా ఫ్యాన్ ఫాలోయింగ్.. ఉంటుందో అదే రీతిలో తెలుగులో కూడా సూర్య అంటే ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ క్రమంలో తెలుగులో సూర్య ఒక స్ట్రైట్ ఫిల్లిం చేయాలని… ఎప్పటినుండో చాలామంది కోరుకుంటున్నారు.
ఇదిలా ఉంటే సూర్య కెరియర్ లో “సింగం” సిరీస్ సినిమాలు మైలురాయిలా నిలిచిపోయాయి. 12 సంవత్సరాల క్రితం “సింగం1” విడుదలయి ఆ తర్వాత మూడు భాగాలుగా వచ్చింది. మాస్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోవడం జరిగింది. అనేక రికార్డులు మరియు కలెక్షన్లు రాబట్టాయి. ఇలాంటి తరుణంలో ఇప్పుడు డైరెక్టర్ హరి “సింగం 4” స్క్రిప్ట్ రెడీ చేసినట్లు తమిళ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. సింగం మొదటి రెండు భాగాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. మూడో భాగం మిక్స్డ్ టాక్ రావడం జరిగింది.
దీంతో సింగం 3తో అంతా ముగిసిపోయింది అని అభిమానులు డిసైడ్ అయ్యారు. కానీ లేటెస్ట్ గా డైరెక్టర్ హరి “సింగం 4” రెడీ చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో చాలా పవర్ ఫుల్ యాక్షన్ ఎపిసోడ్స్ ప్లాన్ చేసినట్లు సమాచారం. ఇక ఈ సినిమాతో పాటు “జై భీమ్” తరహాలో జ్ఞానవేల్ తో మరో ప్రయోగాత్మక చిత్రం చేయటానికి సూర్య రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వచ్చే ఏడాది మార్చిలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్లు సమాచారం.