Prabhas: టాలీవుడ్ ఇండస్ట్రీలో చిరంజీవి తమ్ముడిగా ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ కెరీర్లో తిరుగులేని సూపర్ బ్లాక్ బస్టర్ సినిమా తొలిప్రేమ. కరుణాకరన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా పవన్ కళ్యాణ్ క్రేజ్ అమాంతం పెంచటమే కాక ఓ ట్రెండ్ సృష్టించింది. ఈ సినిమా నుండి మరింతగా పవన్ కళ్యాణ్ యూత్ క్రేజీ సంపాదించాడు. సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన రికార్డు సృష్టించింది. దీంతో డైరెక్టర్ కరుణాకరన్ పేరు కూడా ఇండస్ట్రీ వ్యాప్తంగా మారుమ్రోగింది. ఆ తర్వాత కరుణాకరన్ ఇండస్ట్రీలో అనేక మంది హీరోలతో సినిమాలు చేసిన పెద్దగా విజయాలు సాధించలేదు.
పవన్ కళ్యాణ్ తో దాదాపు మూడు సినిమాలు చేయడం జరిగింది. ఇదే కరుణాకరన్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో “డార్లింగ్” సినిమా చేశారు. సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. 2010వ సంవత్సరంలో వచ్చిన ఈ సినిమా ప్రభాస్ కి మంచి విజయాన్ని అందించింది. చత్రపతి తరువాత వరుస ఫ్లాపులతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో “డార్లింగ్” సినిమాతో లవర్ బాయ్ రొమాంటిక్ తరహా ఇమేజ్ ప్రభాస్ కి క్రియేట్ అయింది. ఇలా ఉంటే ప్రస్తుతం ప్రభాస్ రేంజ్ ఊహించని విధంగా దేశవ్యాప్తంగా విస్తరించింది అన్న సంగతి తెలిసిందే.
Read More: Prabhas: ఆసియా ఖండంలో.. సౌత్ ఇండియా హీరోలలో సరికొత్త ఇమేజ్ సంపాదించిన ప్రభాస్..!!
బాహుబలి తో ప్రభాస్ తలరాత మారిపోవడంతో ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో ప్రభాస్ ప్రాజెక్టులు వస్తున్నాయి. అయినా కానీ ఎలాంటి తరుణంలో డార్లింగ్ డైరెక్టర్ కరుణాకరన్ కి ఛాన్స్ ఇచ్చినట్లు ఆయనతో సినిమా చేయడానికి ప్రభాస్ రెడీ అయినట్లు సమాచారం. ఇటీవల ఓ రొమాంటిక్ స్క్రిప్ట్ తో ప్రభాస్ దగ్గరికి కరుణాకరం వెళ్లినట్టు లైన్ నచ్చడంతో పూర్తి స్క్రిప్టు వర్క్ అయ్యాక మరోసారి స్టోరీ వినిపించాలని ప్రభాస్ అన్నట్లు లేటెస్ట్ ఫిల్మ్ నగర్ టాక్.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!