NewsOrbit
Entertainment News సినిమా

NTR 30: ఎన్టీఆర్ తో చేయబోయే సినిమా స్టోరీ మెయిన్ లైన్ చెప్పేసిన డైరెక్టర్ కొరటాల..!!

Share

NTR 30: కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేయబోతున్న సినిమా షూటింగ్ పూజా కార్యక్రమాలు ఈరోజు స్టార్ట్ అయ్యాయి. ఈ కార్యక్రమానికి డైరెక్టర్ కొరటాలతో పాటు నిర్మాత కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్, జాహ్నవి కపూర్, రాజమౌళి, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్… మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పాల్గొనడం జరిగింది. హైదరాబాద్ స్టార్ హోటల్ నంద జరిగిన ఈ కార్యక్రమం కి ముఖ్యఅతిథిగా వచ్చిన రాజమౌళి… ఎన్టీఆర్, జాన్వి కపూర్ లపై ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టారు.

Director Koratala told the story main line of the film to be made with NTR

ఈ సందర్భంగా కొరటాల శివ సినిమా స్టోరీకి సంబంధించి మెయిన్ లైన్ చెప్పేశారు. సముద్ర తీరానికి సంబంధించిన స్టోరీ అని.. అక్కడ మనుషులకు భయమనేది తెలియని మృగాలు మాదిరిగా ఉండే వాళ్ళని చెప్పారు. కానీ అటువంటి వ్యక్తులకు ఒక భయం మాత్రం ఉందని చెప్పుకొచ్చారు. ఆ భయం ఏంటో మీకు కూడా తెలుసు అంటూ హీరో క్యారెక్టర్జేషన్ గురించి చిన్న హింట్ ఇచ్చారు. భయం ఉండాలి. భయం అవసరం. భయపెట్టడానికి ప్రధాన పాత్ర ఏ స్థాయికి వెళ్తుంది అనేది ఒక ఎమోషనల్ రైడ్. దీన్ని భారీ స్థాయిలో తీసుకువస్తాం. కచ్చితంగా ఇది నా కెరియర్ లో బెస్ట్ సినిమా అవుతుంది అని ఆశిస్తున్నా.

Director Koratala told the story main line of the film to be made with NTR

ఈ సినిమా స్టోరీ మ్యూజిక్ డైరెక్టర్ అనిల్ రావిపూడి విని చాలా ఇంప్రెస్ అయ్యారు.. అంటూ కొరటాల శివ కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు అభిమానులు పెట్టేసుకున్నారు. ఎన్టీఆర్ కెరియర్ లో ఇది 30వ సినిమా కావడంతో.. కచ్చితంగా సూపర్ హిట్ అయ్యే రీతిలో… చాలా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. కొరటాల చివరి సినిమా “ఆచార్య” అట్టర్ ఫ్లాప్ కావడంతో “NTR 30” ప్రాజెక్ట్ పై ప్రత్యేకమైన దృష్టి పెట్టడం జరిగింది. పైగా “ఆర్ఆర్ఆర్” ఇంటర్నేషనల్ రేంజ్ లో విజయం సాదించిన నేపధ్యంలో ఈ మూవీ స్క్రిప్ట్ లో మార్పులు చేసి పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తీర్చిదిద్దడం జరిగిందట. కాగా ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ లో రిలీజ్ చేయబోతున్నారు.


Share

Related posts

చిరు ‘సామ్ జామ్’ టాక్ షో హైలెట్స్…!

siddhu

RGV OTT Spark: కొందరంతే తిట్టినా చూస్తాం.. ఆ చొరవతో వర్మ ఓ ఓటీటీ..!!

Srinivas Manem

Sarkaru Vaari Paata: ‘సర్కారు వారి పాట’ మేకర్స్ సంచలన నిర్ణయం.. టిక్కెట్ల రేట్లు పెంచడం లేదట!

Ram