Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత మంచి జోరు మీద ఉన్న సంగతి తెలిసిందే. దాదాపు మూడు సంవత్సరాలు రాజకీయరంగంలో ఫుల్ బిజీ అయిన పవన్ “వకీల్ సాబ్” సినిమాతో మళ్లీ సినిమాలు స్టార్ట్ చేసి … వరుసపెట్టి సినిమాలు లైన్ లో పెడుతున్నారు. ఒక పక్క రాజకీయాలు మరో పక్క సినిమాలు చేస్తూ రెండు రంగాలలో తనదైన శైలిలో రాణిస్తున్నారు. ప్రస్తుతం రానాతో మల్టీ స్టారర్ సినిమా చేస్తూ మరో పక్క క్రిష్ దర్శకత్వంలో “హరిహర వీరమల్లు” అనే సినిమా చేస్తున్నారు.
ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత అధికంగా ఉండటంతో షూటింగ్ కి కాస్త విరామం ఇచ్చారు. పరిస్థితి ఇలా ఉండగా పవన్ కళ్యాణ్ అభిమానులకు “హరిహర వీరమల్లు” డైరెక్టర్ క్రిష్ సరికొత్త సర్ ప్రైజ్ రెడీ చేస్తున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వైరల్ అవుతున్నాయి. మేటర్ లోకి వెళ్తే సెప్టెంబర్ 2వ తారీఖు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు నేపథ్యంలో.. సినిమా టీజర్ రిలీజ్ చేయాలని ఇప్పుడు వాదాన్ని టార్గెట్ గా పెట్టుకుని.. క్రిష్ వర్క్ చేస్తున్నట్లు ఇండస్ట్రీ టాక్.
Read More: Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా గురించి క్లారిటీ ఇచ్చిన బండ్ల గణేష్..!!
సోషల్ మీడియాలో ఈ విషయం ముందుగానే రావడంతో పవన్ అభిమానులు సెప్టెంబర్ రెండవ తారీకు.. బర్తడే తో పాటు ఈ సినిమా టీజర్ తో సరికొత్త రికార్డులు సృష్టించాలని.. తాజా వార్త తో ఏర్పాటు చేసుకుంటున్నారు. అదే రీతిలో సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న నిధి అగర్వాల్ ఫస్ట్ లుక్.. ఆగస్టు 17 వ తారీకు ఆమె పుట్టిన రోజు ఈ సందర్భంగా రిలీజ్ చేయాలని క్రిష్ అనుకుంటున్నట్లు సమాచారం.