Prabhas: పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ బర్త్ డే అక్టోబర్ 23 వ తారీకు కావటంతో అభిమానులు ఇప్పటినుండే భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఆరోజు ప్రభాస్ నటించిన రెబల్, వర్షం లేదా చత్రపతి సినిమాలు రీ రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా వుంటే మారుతి దర్శకత్వంలో ప్రభాస్ సినిమా ఒప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి “డీలక్స్ రాజా” అనే టైటిల్ కూడా ప్రచారం జరుగుతుంది. అయితే ప్రభాస్ బర్తడే నేపథ్యంలో మారుతి సినిమా షూటింగ్ అక్టోబర్ 17వ తారీకు మొదటి షెడ్యూల్ స్టార్ట్ చేయడానికి రెడీ అయ్యారట.
కొద్దిపాటి షూటింగ్ కంప్లీట్ చేసి ప్రభాస్ బర్త్ డే నాడు సినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసి ఫ్యాన్స్ నీ సర్ప్రైజ్ చేయాలని మారుతి డిసైడ్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఈ సినిమా షూటింగ్ అతి తక్కువ టైంలో మారుతి కంప్లీట్ చేయనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో విలన్ పాత్రలో సంజయ్ దత్ నటించబోతున్నట్లు పాన్ ఇండియా నేపథ్యంలో సినిమా రిలీజ్ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. “బాహుబలి” మొదలు ఇప్పటివరకు ప్రభాస్ నటించిన అన్ని సినిమాలకు దాదాపు ఏడాది నరకు పైగానే షూటింగులు జరుపుకున్నాయి.
దీంతో ప్రతి సినిమాకి టైం ఎక్కువ పడుతూ ఉండటంతో మారుతి సినిమాని అతి తక్కువ టైంలో కంప్లీట్ చేయాలని ముందుగానే మాట్లాడుకొని ప్రభాస్ ఒప్పుకున్నట్లు వచ్చే ఏడాది సమ్మర్ లోనే ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ ఆది పురుష్, సలార్, ప్రాజెక్టు కె సినిమాలు చేస్తున్నారు. ఈ సినిమాలకు సంబంధించిన అప్ డేట్ కూడా ప్రభాస్ పుట్టినరోజు నాడు వచ్చే అవకాశాలున్నట్లు ఫిలింనగర్ టాక్.