ఒరు ఆడార్ లవ్ చిత్రంలోని ఓ పాట.. అందులో చిన్నగా కన్నుగీటే సన్నివేశంతో ప్రియా ప్రకాష్ వారియర్ రాత్రికి రాత్రే సెన్సేషనల్ స్టార్ అయ్యింది. ఈ క్రేజ్‌ను నిర్మాతలు క్యాష్ చేసుకోవాలనున్నారట. దాంతో స్క్రిప్ట్‌లో ప్రియా ప్రకాష్ వారియర్‌కు ప్రాధాన్యత ఇస్తూ స్క్రిప్ట్‌ను మార్చమని ఒత్తడి చేశారట. దాంతో దర్శకుడు ఒమర్ లులు.. స్క్రిప్ట్‌ను మార్చక తప్పలేదట. ఈ విషయాన్ని ఆయనే స్వయం చెప్పడం కొసమెరుపు. న్యూరిన్ షరీష్దే కీలక పాత్ర అని.. అయితే నిర్మాతల ఒత్తిడితో స్క్రిప్ట్ మొత్తం మారిపోయిందని.. దాని కారణంగా సినిమా కథా గమనమే మారిపోయిందని న్యూరిన్ కంటే ప్రియా ప్రకాష్ గొప్ప నటేం కాదని ఆయన విమర్శలు చేయడం గమనార్హం. ఇంతకు ముందు న్యూరిన్ కూడా ప్రియా ప్రకాష్‌పై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అయితే వీటిపై ప్రియా ప్రకాష్ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.
previous post
next post