Salaar: కేజిఎఫ్… సినిమాలతో ఇండియన్ బాక్స్ ఆఫీస్ నీ దద్దరిల్లి పోయేటట్టు చేశాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో.. పాటు టేకింగ్.. హై ఓల్టేజ్ హీరో ఎలివేషన్స్… తీయటంలో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ నీ మించిన దర్శకుడు లేరని చాలా మంది ప్రముఖులు కామెంట్లు చేయడం జరిగింది. రాజమౌళికి ఎంత సత్తా ఉందో అంతే … స్టామినా ప్రశాంత్ నీల్ కి ఉందని.. “కేజిఎఫ్” సినిమాలు చూశాక జనాలు చెప్పుకొస్తున్నారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇదిలా ఉంటే ఇప్పుడు ప్రశాంత్ నీల్..పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ తో “సలార్” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. “బాహుబలి” వంటి భారీ బ్లాక్ బస్టర్ తో ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ తిరుగులేని క్రేజ్ సాధించడంతో… “కేజిఎఫ్” వంటీ సినిమాతో.. ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డులు సృష్టించిన.. డైరెక్టర్ ప్రశాంత్ నీల్…తో చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇదిలావుంటే ఇటీవల ఈ సినిమా హాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఒక యాక్షన్ ఫిలిం నుండి రూపొందిన స్టోరీ అనే వార్త ఇటీవల వైరల్ అవుతుంది.
దీంతో వస్తున్న వార్తలపై డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. “సలార్” నా సినిమాలలో లేదా ఇతర భాషలకు చెందిన సినిమాలో ఎక్కడా కాపీ చేసిన స్టోరీ కాదని.. పక్కా ఫ్రెష్ మూవీ అని వచ్చిన వార్తలను ఖండించారు. ప్రస్తుతం ఇటీవల ఈ సినిమాకి సంబంధించి ఓ షెడ్యూల్ కంప్లీట్ అయింది త్వరలోనే మరో షెడ్యుల్ స్టార్ట్ చేయనున్నట్లు తెలిపారు. “సలార్” సినిమాపై ప్రభాస్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.