Raviteja: కరోనా సీజన్ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీ లో మొట్టమొదటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన హీరో రవితేజ. అంతకు ముందు వరుస ఫ్లాపుల్లో ఉన్న రవితేజ క్రాక్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కిలాడి సినిమా చేస్తూ ఉన్నాడు. ఇదిలా ఉంటే రవితేజ తో సినిమా చేయడానికి టాప్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ రెడీ అయినట్లు ఇండస్ట్రీ వర్గాల లేటెస్ట్ టాక్ వినపడుతోంది. మేటర్ లోకి వెళితే అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి 150 సినిమా కోసం అనేక మంది డైరెక్టర్ ల పేర్లు వినబడ్డాయి.
ఆ సమయంలో పూరి జగన్నాథ్ పేరు కూడా వినపడింది. చిరంజీవి కోసం మాస్ కథాంశం నేపథ్యం కలిగిన “ఆటో జానీ” అనే సినిమా టైటిల్ కలిగిన స్క్రిప్ట్ వినిపించినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఫస్టాఫ్ బాగున్నదని సెకండాఫ్ కొంచెం చేంజ్ చేయాలని చిరంజీవి సూచించడంతో ఆ తర్వాత ఆ ప్రాజెక్టు మరుగున పడింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఇదే స్క్రిప్టుతో రవితేజతో చేయాలని పూరి జగన్నాథ్ డిసైడ్ అయినట్లు సమాచారం. రవితేజ కూడా విన్నట్లు అంతా ఓకే అన్నట్లు త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వైరల్ అవుతున్నాయి.
టాలీవుడ్ ఇండస్ట్రీలో రవితేజ – పూరీ సూపర్ హిట్ కాంబినేషన్ అందరూ అంటుంటారు. రవితేజ ఇండస్ట్రీ లో హీరోగా నిలదొక్కుకోవడానికి పూరి కూడా ఒక కారణమని అంటుంటారు. రవితేజ కెరీర్లో సూపర్ డూపర్ హిట్ అయిన ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి ఆయనని హీరోగా బాగా ప్రేక్షకులలో గుర్తింపు తెచ్చాయని చెబుతుంటారు. ఆ తర్వాత పూరి రవితేజ అనేక సినిమాలు చేసినా పెద్దగా విజయాలు సాధించలేదు. మళ్లీ చాలా కాలం తర్వాత రవితేజ తో పూరి సినిమా చేయటానికి రెడీ అవుతున్నట్లు వార్తలు రావటంతో ఈ వార్త సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.