HBD Vijaydeverakonda: నేడు టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ పుట్టినరోజు కావటంతో సోషల్ మీడియాలో అభిమానులు భారీ ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇదే సమయంలో సెలబ్రిటీలు సైతం విజయ్ దేవరకొండ కి విషెస్ చెబుతున్నారు. అయితే ఈ సందర్భంగా పూరి.. విజయ్ దేవరకొండ కి చెప్పిన విశేష్.. సోషల్ మీడియాలో చాలా హైలెట్ గా నిలిచింది. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న సినిమా “లైగర్”. ఈ సినిమా ఆగస్టు నెలలో విడుదలకు సిద్ధంగా ఉంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఇంటర్నేషనల్ బాక్సర్ గా కనిపిస్తున్నాడు. పైగా ఈ సినిమాలో అంతర్జాతీయ బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ కూడా నటించడంతో సినిమాపై ప్రపంచ స్థాయిలో క్రేజ్ ఏర్పడింది. అంతమాత్రమే కాకుండా ఈ సినిమా అయిన వెంటనే మళ్ళీ పూరి జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ జనగణమన లో విజయ్ దేవరకొండ నటించడంతో పాటు..”లైగర్”.. సినిమాకి దాదాపు రెండు సంవత్సరాలకు పైగా ని పూరీ..విజయ్ తో కలిసి పని చేయడంతో… ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది. ఈ సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షలకి పూరి జగన్నాథ్ తనదైన డైలాగ్ లతో.. తెలియజేశారు.
“నీ గుండెలో ఉన్న మంటలు చూశాను, అదే రీతిలో నీలో ఉన్న నటుడ్ని కూడా చూశాను, నీ మైండ్ లో ఎటువంటి ఆలోచనలు మెదులుతున్నాయో కూడా నాకు తెలుసు. నీ ఆకలి.. నీ కమిట్మెంట్.. నీయొక్క తగ్గింపు తత్వం.. ఒకరోజు ఉన్నత స్థాయిలోకి తీసుకెళ్తాది. కచ్చితంగా ఒక రోజు దేశం నిన్ను చూసి గొప్ప నటుడు అని చెప్పు కొన్నే రోజులు రాబోతున్నాయి. ప్రస్తుతానికి నేను నిన్ను విజయ్ దేవరకొండ అని పిలుస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాను అంటూ పూరి జగన్నాథ్ చాలా ఎమోషనల్.. విషెస్ తెలియజేశారు. ఇదిలా ఉంటే శివ నిర్వాణ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా షూటింగ్ సెట్ లో హీరోయిన్ సమంతతో కలిసి విజయ్ దేవరకొండ కేక్ కట్ చేయడం జరిగింది. చాలామంది బాలీవుడ్ మొదలుకొని సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ వరకు రౌడీ విజయ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!