Puri jagannath : డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో హీరో విజయ్ దేవరకొండ ‘లైగర్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా పై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. లాక్డౌన్ కి ముందు ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ దాదాపు 40 శాతం పూర్తయింది. లాక్డౌన్ తర్వాత గత ఏడాది డిసెంబర్ మాసంలో షూటింగ్ ప్రారంభ అయ్యి ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. సినిమాలో బాక్సర్ పాత్రలో విజయ్ దేవరకొండ నటిస్తున్నట్లు ‘లైగర్’ సినిమా హీరోయిన్ గతంలో రిలీజ్ చేసిన పోస్టర్ బట్టే అర్థమవుతుంది.
అంతే కాకుండా మరో పక్క మాఫియా డాన్ గా కూడా విజయ్ దేవరకొండ కనిపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రమ్యకృష్ణ కీలక పాత్ర పోషిస్తోంది. ఇటువంటి తరుణంలో తాజాగా ఈ సినిమా యూనిట్ తో ప్రముఖ డైరెక్టర్ మరియు కొరియోగ్రాఫర్ డాన్స్ మాస్టర్ ప్రభుదేవా … ఫోటో దిగటం తో ఫోటో సోషల్ మీడియాలో రావడంతో ‘లైగర్’ కోసం ప్రభుదేవాని రంగంలోకి పూరి జగన్నాథ్ దింపినట్లు .. సినీ లవర్స్ భావిస్తున్నారు.
సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం ప్రభుదేవాని తీసుకుంటున్నట్లు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే ‘లైగర్’ తన కెరియర్ లోనే ది బెస్ట్ సినిమా అని అప్పట్లో పూరిజగన్నాధ్ అనటంతో .. సినిమా స్టోరీ ఏ విధంగా ఉంటుందో .. పూరి టేకింగ్ ఏ మాదిరిగా ఉంటుందో అని అభిమానులు ఊహల లోకంలో తేలిపోతున్నారు. సెప్టెంబర్ 9వ తారీఖున తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ కానుంది. వరస ఫ్లాపుల్లో ఉన్న విజయ్ దేవరకొండ ‘లైగర్’ సినిమాపై అంచనాలు ఓ రేంజిలో పెట్టుకున్నారు.