RRR: దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడ చూసినా “ఆర్ఆర్ఆర్” గురించి మాట్లాడుకునే పరిస్థితి నెలకొంది. బాహుబలి లాంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత ఎక్కడ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో ఈ సినిమా రావడంతో భారీ అంచనాలు నెలకొన్నగా వాటిని అందుకునే “ఆర్ఆర్ఆర్”తో మరోసారి జక్కన్న తన సత్తా చాటాడు. సినిమాలో ప్రతి ఫ్రేమ్.. విజువల్ వండర్ చూసే ప్రేక్షకుడిని.. ఎంతగానో రక్తి కట్టించాయి. చరణ్.. తారక్ ఇద్దరు డాన్స్.. నటనాపరంగా సంపూర్ణ న్యాయం చేయటంతో.. ప్రేక్షకులు సినిమాని బాగా ఆస్వాదిస్తున్నారు.
దీంతో సామాన్య ప్రేక్షకులతో పాటు సెలబ్రిటీలు సైతం సినిమా చూసి ఊహించని విధంగా స్పందిస్తూ ఉన్నారు. తాజాగా ఈ సినిమాను చూసిన ప్రముఖ సెన్సేషనల్ పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్… దర్శకుడు రాజమౌళి ని పొగడ్తలతో ముంచెత్తారు. “”ఆర్ఆర్ఆర్” విజువల్ వండర్..గా కన్నుల పండుగగా ఉందని.. అసలు చూపు తిప్పుకోనివ్వని సన్నివేశాలు చాలా శక్తివంతంగా తెరకెక్కించారని ప్రశంసించారు. “ఆర్ఆర్ఆర్” విజయం ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటుంది అని.. అసాధారణ అనుభూతికి లోనయ్యాను అని..”ఆర్ఆర్ఆర్” సినిమానీ పొగడ్తలతో ముంచెత్తారు.
అద్భుతమైన నటన మరియు స్క్రీన్ ప్రెజెన్స్ తో చరణ్, ఎన్టీఆర్ మనసులను దోచుకున్నారని చెప్పుకొచ్చారు. ఒక మెరుపు లాంటి సన్నివేశాలు ఉన్నాయని రాజమౌళి ఊహ శక్తికి తిరుగులేదు మహా రాజమౌళికి హాట్సాఫ్ అంటూ… శంకర్ సోషల్ మీడియాలో రియాక్ట్ అయ్యారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా భారీ ప్రాజెక్ట్ శంకర్ చేస్తూ ఉండటం విశేషం. ఒక్క దర్శకుడు శంకర్ మాత్రమే కాదు.. మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ సుకుమార్, అనిల్ రావిపూడి ఇంకా చాలా మంది ప్రముఖులు “ఆర్ఆర్ఆర్” చూసి డైరెక్టర్ రాజమౌళి ని పొగడ్తలతో ముంచెత్తారు.
Bigg Boss Ashwini: రాత్రి 4 అయినా నిద్ర పట్టడం లేదు… బోల్డ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ అశ్విని..!