RRR: “ఆర్ఆర్ఆర్” సౌండ్ డబల్ త్రిబుల్ గా దేశంలోనే కాదు ప్రపంచంలో గట్టిగా వినపడుతోంది. “బాహుబలి” లాంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత రాజమౌళి తెరకెక్కించిన “ఆర్ఆర్ఆర్” అంచనాలను అందుకోవడంలో ఏమాత్రం మిస్ కాలేదు. సినిమాలో ఒక్కో సన్నివేశం.. చూసే ఆడియన్స్ నీ కుర్చీలో కూర్చొనివ్వకుండా… నిలబడేలా చప్పట్లు కొట్టేలా… రాజమౌళి టేకింగ్ అదరగొట్టేలా చేసింది. సామాన్యులు మొదలుకొని సెలబ్రిటీల వరకు “ఆర్ఆర్ఆర్” చూసి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇండస్ట్రీలో చిరంజీవి, మహేష్ బాబు, అల్లు అర్జున్, సుకుమార్ ..”ఆర్ఆర్ఆర్” సినిమా యూనిట్ ని రాజమౌళి ని పొగడ్తలతో ముంచెత్తారు. అయితే తాజాగా ఈ సినిమాను చూసిన రామ్ గోపాల్ వర్మ.. సినిమా యూనిట్ ని ప్రశంసించారు.
ముఖ్యంగా డైరెక్టర్ రాజమౌళి ని పొగడ్తలతో ట్విటర్లో ఆకాశానికెత్తేశారు. ‘బాహుబలి – 2 అనేది చరిత్ర అయితే, “ఆర్ఆర్ఆర్” అనేది చారిత్రాత్మకం. రాజమౌళి బాక్సాఫీస్‌కు మోక్షం కల్పించిన గొప్ప వ్యక్తి’ అంటూ రాసుకొచ్చారు. దీంతో ఆర్జీవీ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఎప్పుడు ఏదో రీతిలో కించపరిచే రీతిలో నెగిటివ్ కామెంట్ చేసే తరహాలో…. రియాక్ట్ అయ్యే ఆర్జీవీ.. పాజిటివ్ గా రెస్పాండ్ కావటంతో… నందమూరి మెగా అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు.
“బాహుబలి” మాదిరిగానే “ఆర్ఆర్ఆర్” ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ లెవెల్ ని.. మరో ఎత్తుకు తీసుకెళ్లడం జరిగింది. రాజమౌళి దర్శకత్వ శైలిలో.. సినిమాలో సన్నివేశాలు.. హాలీవుడ్ స్థాయిలో ఉన్నాయి..అని.. సినిమా చూసిన ఆడియన్స్ చెప్పుకొస్తున్నారు. గ్యారెంటీగా “ఆర్ఆర్ఆర్” బాహుబలి 2 రికార్డులు బ్రేక్ చేయడం జరుగుతుందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. మొదటి రెండు రోజులు ఆల్ టైం రికార్డ్ కలెక్షన్ లు కొల్లగొట్టింది. పూర్తి రన్ టైం లో వరల్డ్ రికార్డు కూడా కొట్టే అవకాశాలు ఉన్నట్లు.. తాజా కలెక్షన్ల బట్టి టాక్ నడుస్తుంది.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!