హరికృష్ణనే అసలైన విలన్?

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాతో సంచనలం సృష్టించేలా ఉన్నాడు. ఇప్పటి వరకూ రోజుకో అప్డేట్ ఇస్తూ ఆడియన్స్ ని ఊరించిన వర్మ, ఇప్పుడు ఏకంగా అన్నగారి ఆత్మ తనతో మాట్లాడుతోందని, రామారావు శాసించాడు నేను పాటిస్తాను అంటున్నాడు.

వర్మకి కనిపించిన అన్నగారి ఆత్మ “బాలకృష్ణ తెరకెక్కిస్తున్న ‘మహానాయకుడు’ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన 24 నిమిషాల తర్వాత ట్రైలర్ రిలీజ్” చేయమని చెప్పిందట. నందమూరి తారక రామారావు ఆశీర్వాదం తమ సినిమాపైనే ఉందని చెప్తున్న వర్మ, లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ప్రొమోషన్స్ వేగం పెంచాడు.

ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా నుంచి రీసెంట్ గా వర్మ రిలీజ్ చేసిన ఫొటోస్ చూస్తుంటే, లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో మెయిన్ విలన్ చంద్రబాబే అయినా కూడా కుటుంబంలో గొడవలకి కారణం మాత్రం హరికృష్ణనే అని తెలుస్తోంది. లక్ష్మీ పార్వతిని టార్గెట్ చేసి హరికృష్ణ చేసిన పనులు ఈ సినిమాలో చూపించబోతున్నామనే ఫీలింగ్  కలిగిస్తున్న వర్మ, మహానాయకుడు సినిమాకి భారీ షాక్ ఇచ్చేలానే ఉన్నాడు. అయితే సినీ అభిమానులకి అర్ధం కానీ మరో విషయం ఏంటంటే ఎన్టీఆర్ ఆత్మ… లక్ష్మీస్ ఎన్టీఆర్ డైరెక్టర్ వర్మతో, లక్ష్మీస్ వీరగ్రంధం డైరెక్టర్ కేతి రెడ్డితోనే ఎందుకు మాట్లాడుతోంది? సినిమా ప్రమోషన్ పేరుతో రామారావు పేరుని అడ్డం పెట్టుకోని ఇద్దరు వ్యక్తులు నందమూరి కుటుంబాన్ని అనరాని మాటలు అంటుంటే నందమూరి ఫ్యామిలీ మెంబర్స్ ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారు? వర్మని, కేతిరెడ్డిని ఆపే ప్రయత్నం ఎందుకు చేయలేకపోతున్నారు అనేదే ఇప్పుడు మిళియన్ డాలర్ ప్రశ్నగా మిగిలింది.