RC 15: “మగధీర” ఫైట్ తరహాలో “RC 15″లో శంకర్ భారీ ప్లాన్..??

Share

RC 15: 2009వ సంవత్సరంలో రాజమౌళి(Rajamouli) దర్శకత్వంలో రామ్ చరణ్(Ram Charan) నటించిన “మగధీర”(Magadheera) ఇండస్ట్రీ హిట్ అవడం తెలిసిందే. ఈ సినిమా విజయంతో చరణ్ కి మంచి గుర్తింపు వచ్చింది. చిరంజీవి వారసుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో “చిరుత” తో ఎంట్రీ ఇచ్చిన చెర్రీ.. మొదటి సినిమాతో పర్వాలేదనిపించాడు. ఇక రెండో సినిమాతో మాత్రం.. అందరినీ ఆశ్చర్యపరిచాడు. మగధీరలో అన్నిటికంటే హైలెట్ సెకండ్ హాఫ్ లో వచ్చే వందమంది ఫైట్. రామ్ చరణ్ 100 మందితో ఒక్కడే చేసే ఫైట్ సినిమాకి హైలెట్ గా నిలిచింది. అప్పట్లో రాజమౌళి టేకింగ్ కి ఈ ఫైట్ తో సినిమా థియేటర్ లు దద్దరిల్లాయి.

ఇదిలా ఉంటే ఇప్పుడు రామ్ చరణ్ … తమిళ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్(Shankar) దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో “మగధీర” తరహాలో ఏకంగా వెయ్యి మందితో శంకర్ ఫైట్ ప్లాన్ చేయటం జరిగింది అంట. హాలీవుడ్ ప్రొఫెషనల్ ఫైటర్స్ సంరక్షణలో ఈ ఫైట్ సీన్.. అత్యాధునిక టెక్నాలజీ కెమెరాలతో చిత్రీకరించనున్నట్లు సమాచారం. ఈ ఫైట్ సీక్వెన్స్ సన్నివేశం కోసం.. భారీగా ఖర్చు చేయనున్నట్లు టాక్. ఒక ఫైట్ మాత్రమే కాదు ఒక సాంగ్ కోసం దాదాపు 400 మంది.. డాన్సర్లతో రామ్ చరణ్ స్టెప్పులు వెయ్యబోతున్నారట.

బాలీవుడ్ కొరియోగ్రాఫర్ ఆధ్వర్యంలో ఈ పాట చిత్రీకరణ జరగనుందట. ప్రస్తుతం సినిమాకి సంబంధించి షూటింగ్ శరవేగంగా సాగుతోంది. వచ్చే ఆగస్టులో చిరంజీవి పుట్టినరోజు నాడు టైటిల్ తో కూడిన పోస్టర్ లేదా వీడియో రిలీజ్ చేయాలని సినిమా యూనిట్ ప్లాన్ చేసినట్లు సమాచారం. శంకర్ దర్శకత్వంలో చరణ్ హీరోగా జరకెక్కుతున్న ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ తమన్. హీరోయిన్ కీయరా అద్వానీ. దిల్ రాజు నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కమెడియన్ సునీల్ కూడా నటిస్తున్నారు. “RRR”తో చరణ్ భారీ విజయం సాధించటంతో “RC 15” పై అభిమానులకు భారీ అంచనాలు నెలకొన్నయి.


Share

Recent Posts

ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై స్పందించిన ఏపీ సీఐడీ .. ఫోరెన్సిక్ రిపోర్టుపై డీజీ ఇచ్చిన క్లారిటీ ఇది

గత కొద్ది రోజులుగా వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ, వైసీపీ నేతల…

40 నిమిషాలు ago

దగ్గు తగ్గాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరి..!

చాలా మందికి సీజన్ మారితే రకరకాల వ్యాధులు వస్తాయి.ముఖ్యంగా చాలా మంది. సీజన్ మారిన వెంటనే దగ్గు, జలుబుతో ఇబ్బందులు పడుతూ ఉంటారు.కొందరు దగ్గె కదా అని…

49 నిమిషాలు ago

చార్మి 13 సంవత్సరాల వయసు నుంచి తెలుసు అంటున్న పూరి జగన్నాథ్..!!

హీరోయిన్ ఛార్మి అందరికీ సుపరిచితురాలే. 15 సంవత్సరాల వయసులోనే సినిమా ఎంట్రీ ఇచ్చిన సార్ మీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇంక హిందీ భాషల్లో సినిమాలు…

1 గంట ago

ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం .. 15 మంది విద్యార్ధులకు గాయాలు

హైదరాబాద్ లోని ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విద్యార్ధులు గాయపడ్డారు. బంజారాహిల్స్ లోని ఆర్కే సినీ మాక్స్ లో గాంధీ సినిమా…

2 గంటలు ago

సమంత టెన్త్ మార్క్ షీట్ లో ఇన్ని తప్పులా!

సమంత రూత్ ప్రభు.. ఇది పరిచయం అక్కర్లేని పేరు.. తన నటన ద్వారా తెలుగు, తమిళ ఇండస్ట్రీలో సక్సెస్ సాధించింది. 2010లో గౌతమ్ మీనన్ రూపొందించిన ‘ఏ…

2 గంటలు ago

“గాడ్ ఫాదర్” టీజర్ రిలీజ్ డేట్ ఖరారు చేసిన సినిమా యూనిట్..!!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా "గాడ్ ఫాదర్". "లూసిఫర్" సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో చిరంజీవితో పాటు బాలీవుడ్…

2 గంటలు ago