Pushpa 2: “పుష్ప 2” రిలీజ్ డేట్ ఇప్పుడు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. వచ్చే ఏడాది ఆగస్టు 15వ తారీకు సినిమా రిలీజ్ చేస్తున్నట్లు తాజాగా మేకర్స్ అధికారిక ప్రకటన చేయడం జరిగింది. దీంతో అదే తేదీని సింగం అగైన్ సినిమాతో బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ అంతకుముందే లాక్ చేయడం జరిగింది. సరిగ్గా ఇప్పుడు ఆ తారీకు నాడే అల్లు అర్జున్ “పుష్ప 2” రావడం హీరో అజయ్ దేవగన్ అసహనం చెందుతున్నట్లు సమాచారం. ఇంకా అదే తేదీకి శంకర్ .. కమల్ సినిమా “ఇండియన్ 2” విడుదల చేయాలని భావించారట. అయితే ఇప్పుడు “పుష్ప 2” ఆగస్టు 15 కి వస్తూ ఉండటంతో.. శంకర్ కూడా బన్నీ పై సీరియస్ అవుతున్నట్లు టాక్.
“పుష్ప 2” లాంటి పాన్ ఇండియా ప్రాజెక్ట్ విడుదల తేదీని ఇంత త్వరగా ప్రకటిస్తారని శంకర్ కలలో కూడా ఊహించలేదట. వాస్తవానికి వచ్చే ఏడాది ఆగస్టు 15వ తారీకు కమల్ తో చేస్తున్న “ఇండియన్ 2” విడుదల చేయాలని శంకర్ ప్లాన్. కానీ ఈ సినిమాకి సంబంధించి గ్రాఫిక్స్ వర్క్ ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. పైగా అవి ఆగస్టు వరకు కంప్లీట్ అవుతాయని శంకర్ కి కూడా గ్రాఫిక్స్ టీం గ్యారెంటీ ఇవ్వలేకపోతున్నాయంట. దీంతో భారతీయుడు సీక్వెల్ పోస్ట్ పోన్ చేసి అదే తేదీనాడు రామ్ చరణ్ తో ప్రస్తుతం చేస్తున్న “గేమ్ చేంజర్” విడుదల చేయాలని అనుకుంటున్నారట. “గేమ్ చేంజర్” షూటింగ్ చాలా వరకు కంప్లీట్ కావడం జరిగింది. టాకీ చిత్రీకరణ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. ఈ ఏడాది డిసెంబర్ నెలలో ఆ టాకీ పార్ట్ షూటింగ్ కూడా కంప్లీట్ కానున్నట్లు సమాచారం.
దీంతో “పుష్ప 2” విడుదల కాబోతున్న అదే తేదీ నాడు ఆగస్టు 15వ తారీకు రామ్ చరణ్ ..”గేమ్ చేంజర్”పోటీకి దింపాలని శంకర్ స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యారట. పదో తేదీని ఫిక్స్ కావడానికి మరొక కారణం.. ఈ సినిమా రిలీజ్ అయ్యే టయానికి నాలుగు రోజులు సెలవులు రాబోతున్నాయంట. ఇక సెకండ్ వీకెండ్ కూడా మరో మూడు రోజులు సెలవులు రాబోతున్నాయట. బ్యాక్ టు బ్యాక్ రెండు లాంగ్ వీకెండ్ లు కావటంతో శంకర్ ఆగస్టు 15వ తారీఖు నాడు చరణ్ “గేమ్ చేంజర్” రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. చరణ్ కెరియర్ లో ఇది హైయెస్ట్ బడ్జెట్ సినిమా కావడంతో.. కలెక్షన్స్ ఏ రీతిగా రాబట్టాలని మేకర్స్ యొక్క ఆలోచన అన్నట్లు వార్తలు వస్తున్నాయి.