Director Srinu Vaitla: డైరెక్టర్ శ్రీను వైట్ల అందరికీ సుపరిచితుడే. ఒకప్పుడు బ్యాక్ టు బ్యాక్ విజయాలు అందుకున్న దర్శకుడు. “నీకోసం” అనే రవితేజ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు. శ్రీను వైట్ల తీసిన వెంకీ, దుబాయ్ శీను, దూకుడు, బాద్షా అనేక రికార్డులు కూడా సృష్టించాయి. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే రీతిలో శ్రీనువైట్ల సినిమాలు ఉంటాయి. ముఖ్యంగా బ్రహ్మానందం చుట్టూ శ్రీను వైట్ల అల్లే కామెడీ ఎన్నో సినిమాలను సూపర్ హిట్ పథంలో నడిపించాయి. కానీ గత కొన్ని సంవత్సరాలు నుండి సరైన హీట్ అందుకోక అవకాశాలు లేక.. కెరియర్ పరంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నాడు. ఇటీవలే గోపీచంద్ తో సినిమా ఒప్పుకోవడం జరిగింది. పూజా కార్యక్రమాలు స్టార్ట్ అయిన ఈ ప్రాజెక్టు త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కాబోతోంది.
ఈ క్రమంలో శ్రీను వైట్ల తన ఇంటిలో విషాదకర సంఘటన చోటు చేసుకున్నట్లు సోషల్ మీడియా ద్వారా స్పష్టం చేశాడు. 13 ఏళ్లుగా తాను ఎంతో ఇష్టంగా పెంచుకున్న ఆవు చనిపోయిందని చెప్పుకొచ్చాడు. తాను మొదటిసారి ఇంటికి తెచ్చుకున్నావు చనిపోవడం చాలా బాధ కలిగించిందని స్పష్టం చేశారు. మా ఇంట్లో కుటుంబ సభ్యురాలిగా ఆ ఆవును అందరం చూసుకుందాం. 13 ఏళ్లుగా దానికి మా ప్రేమను పంచాము. నా కూతురైతే ఆ ఆవును ఎంతో ప్రేమగా.. లక్ష్మీ అని పిలిచేది అని చెప్పారు.
అటువంటి మా ఇంటి లక్ష్మి చనిపోయింది అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడంతో పాటు ఆ ఆవు ఫోటో కూడా షేర్ చేయడం జరిగింది. శ్రీను వైట్ల పోస్ట్ చేసిన ఆ ఆవు ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా నిలిచింది. చాలాకాలం తర్వాత 2018లో రవితేజతో తీసిన అమర్ అక్బర్ ఆంటోనీ సినిమా ఫ్లాప్ అయిన తర్వాత.. ఇటీవల గోపీచంద్ తో కొత్త ప్రాజెక్టు ప్రకటన చేయడం జరిగింది. ఈ క్రమంలో ఇంటిలో ఆవు చనిపోవడంతో శ్రీను వైట్ల నిరాశ చెందుతూ ఉన్నాడు. ఆ ఆవుని ఎంతో సెంటిమెంట్ గా భావిస్తూ.. ఉన్న క్రమంలో ఐదు సంవత్సరాల గ్యాప్ తర్వాత సినిమా షూటింగ్ ప్రారంభించే ముందు ఆవు చనిపోవడం.. శ్రీను వైట్ల తట్టుకోలేని బాధలో ఉన్నారట. ఆ ఆవుని చాలా సెంటిమెంట్ గా ఫీల్ అవుతారట. అటువంటివి చాలాకాలం తర్వాత సినిమా చేసే పరిస్థితులు ఏర్పడిన క్రమంలో ఈ సంఘటన శ్రీనువైట్లని తల్లడింప జేస్తూ ఉందట.